English | Telugu
Eto Vellipoyindhi Manasu : నందినితో డీల్ కుదుర్చుకున్న సందీప్.. ఆ వేడుకల్లో తను చెప్పగలదా!
Updated : Aug 17, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -177 లో... శ్రీలత కావాలనే సీతాకంత్ చూడాలని.. దేవుడు ముందు చేతిలో కర్పూరం వెలిగిస్తూ.. నా బిడ్డ సీతాకాంత్ ఎప్పుడు బాగుండాలని అంటుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావ్ అమ్మ అని శ్రీలత ప్రేమని చూసి పొంగిపోతుంటాడు. ఈవిడ ఇంత ఎక్స్ ట్రా చేస్తుందంటే మళ్ళీ ఏదో ప్లాన్ లో ఉన్నట్టుందని రామలక్ష్మి అనుకుంటుంది.
అ తర్వాత సీతాకాంత్ కి అందరు బర్త్ డే విషెస్ చెప్తుంటారు. పెద్దాయన దగ్గర సీతాకాంత్ ఆశీర్వాదం తీసుకంటాడు. శ్రీలత దగ్గర తీసుకోబోతుంటే.. ఇప్పుడు ఎందుకు? ఈవెనింగ్ బర్త్ డే కి వచ్చిన వారి ముందు తన భాగోతం బయటపెట్టి ఆశీర్వాదం తీసుకోమని రామలక్ష్మి అనగానే.. అందరూ షాక్ అవుతారు. అదే మంచితనం గురించి చెప్పి ఆశీర్వాదం తీసుకోండి అని రామలక్ష్మి కవర్ చేస్తుంది. దానికి సీతాకాంత్ సరేనంటాడు. ఆ తర్వాత నందిని దగ్గరకి రామలక్ష్మి బొకేతో వెళ్తుంది. రామలక్ష్మి థాంక్స్ అంటూ నందినికి చెప్తుంది. ఎందుకు థాంక్స్ ఒకరకంగా నా కంపెనీ డెవలప్ అవ్వాలని స్వార్థం కూడా ఉందని నందిని అంటుంది. మీ భర్త పుట్టిన రోజు ఏర్పాట్లు జరుగుతున్నాయా అని నందిని అనగానే.. ఈ రోజు మా అయన పుట్టిన రోజు అని మీకెలా తెలుసని రామలక్ష్మి అంటుంది. అలా అనగానే కలిసి పని చేయబోతున్నాం.. ఆ మాత్రం తెలియదా అని నందిని అంటుంది. ఈ రోజు బర్త్ డే కీ రండి అని రామలక్ష్మి అనగానే.. నాకు వీలవ్వదని నందిని చెప్తుంది. ఎలాగైనా రావాలని రామలక్ష్మి అనగానే.. సరేనని నందిని అంటుంది. అదే టైమ్ కి నందిని దగ్గర కి సందీప్ వస్తాడు. రామలక్ష్మి చూస్తుందని దాక్కుంటాడు. రామలక్ష్మి వెళ్లకా నందిని దగ్గరికి సందీప్ వెళ్లి.. నాకు ఎండీ అవ్వాలని కోరిక మీరు సపోర్ట్ చెయ్యండి.. మీకు బెనిఫిట్ ఉందని సందీప్ అనగానే.. నాకు ఓకే అని నందిని అంటుంది. ఆ విషయం ఈ రోజు బర్త్ డే కి వస్తున్నాను కదా అక్కడ చెప్తానని నందిని అంటుంది.
అ తర్వాత నందిని డీల్ కీ ఒప్పుకున్న విషయం.. సందీప్ హ్యాపీగా ఫీల్ అవుతూ శ్రీలతకి చెప్తాడు. మరొకవైపు రామలక్ష్మి బర్త్ డే ఏర్పాట్లు చెయ్యండని పనిమనిషికి చెప్తుంది. అప్పుడే శ్రీలత వచ్చి.. ఏంటి బర్త్ డే ఏర్పాట్లు చేస్తున్నావా.. ఎంత ఆనందపడితే అంత బాధపడతావని శ్రీలత అనగానే.. మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్లుందని రామలక్ష్మి అనుకుంటుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.