English | Telugu
Eto Vellipoyindhi Manasu : పోలీస్ స్టేషన్ లో భర్త.. ఆ కేసు నుండి భర్తని విడిపించగలదా!
Updated : Aug 3, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -165 లో.... సీతాకాంత్ ని అరెస్ట్ చెయ్యడానికి పోలీసులు వస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని రామలక్ష్మి అడుగగా.. నేను చెప్తానంటూ నమిత వచ్చి.. నన్ను బలవంతం చెయ్యబోయాడని చెప్తుంది. అదంతా అబద్ధం కావాలనే ఇదంతా చేస్తుంది నమ్మకండి అని సీతాకాంత్ అంటాడు. నా భర్తని ఎక్కడికి తీసుకొని వెళ్లొద్దంటూ రామలక్ష్మి అడ్డుపడుతుంది. మా అన్నయ్య అలాంటి వాడు కాదని నమితపైన సిరి కోప్పడుతుంది.
ఆ తర్వాత సీతాకాంత్ గురించి నమిత తప్పుగా మాట్లాడుతుంటే.. శ్రీలత వచ్చి నమితని కొడుతుంది. నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడకని అంటుంది. ఆ తర్వాత మీకు సాక్ష్యం కావాలా చూపించండి ఎస్ ఐ గారు అని నమిత అనగానే.. వాళ్ళు నమిత తీసిన వీడియో చూపిస్తారు. అందులో సీతాకాంత్ నమితని బలవంతం చేయబోతుంటే వద్దని బయటకు వచ్చే వీడియో ఉంటుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. ఇంకా నమ్మకపోతే మీ ఇంట్లో మనిషే సందీప్ గారు.. మీరు చెప్పండి అసలు నిజం ఏంటని నమిత అనగానే. నా నోటితో అది ఎలా చెప్పాలంటాడు సందీప్. అన్నయ్య కాన్ఫరెన్స్ రూమ్ కి నమిత వెళ్లడం నేను చూసాను. కాసేపటికి గట్టిగా నమిత అరుస్తూ బయటకు వచ్చింది. వెనకాలే అన్నయ్య ఉన్నాడని సందీప్ చెప్తాడు. ఆ తర్వాత అక్కడ జరిగింది వేరే.. మీరు ఆవేవీ నమ్మకండి అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. రామలక్ష్మి ఏడుస్తుంటే నేను బయటకు తీసుకొని వస్తానని పెద్దాయన అంటాడు. శ్రీలత, సందీప్, శ్రీవల్లి ముగ్గరు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు.
ఆ తర్వాత సీతాకాంత్ స్టేషన్ లో ఉండగా.. రామలక్ష్మి, పెద్దాయన లాయర్ ని తీసుకొని వెళ్తారు. లాయర్ ఎస్ ఐ తో మాట్లాడతాడు. కేసు చూసి.. ఇది మాములు విషయం కాదు.. బెయిల్ కూడా రాదని లాయర్ చెప్తాడు. సీతాకాంత్ ఏ తప్పు చెయ్యలేదని నిరూపించే సాక్ష్యం కావాలని లాయర్ చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ దగ్గరికి వెళ్లి.. అసలేం జరిగిందని అడుగుతుంది. నమిత విషయం మొత్తం సీతాకాంత్ చెప్తాడు. ఎవరు నమ్మిన నమ్మకపోయిన నువ్వు నమ్మితే చాలని సీతాకాంత్ అంటాడు. మీ గురించి తెలుసు.. నేను ఎలా నమ్ముతాను .. మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తానని రామలక్ష్మి అనగానే.. సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.