English | Telugu

Karthika Deepam2 : శౌర్య కోసం లాయర్ ని కలవనున్న కార్తీక్.. నరసింహా ప్లాన్ ఏంటంటే! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( karthika deepam 2 ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -113 లో.... నర్సింహా నోటీసులు విషయం సుమిత్ర దశరత్ లకి చెప్తుంది దీప. నా కూతురు నా నుండి దూరం కాకుండా చూడండి అని వాళ్ళ కాళ్ళు పట్టుకొని అడుగుతుంది దీప. మేమ్ చూసుకుంటామని వాళ్ళు అనగానే.. దీప బయటకు వచ్చి కార్తీక్ కి చెప్పాలనుకుంటుంది. మరొకవైపు ఇన్ని రోజులు ఎప్పుడు సాయం చేస్తామన్నా కూడా వద్దని అనేది.. ఇప్పుడు సాయం చేసే అవకాశం వచ్చిందని దశరత్ తో సుమిత్ర అంటుంది.

ఆ తర్వాత కార్తీక్ కి దీప ఫోన్ చేసుంటే.. కార్తీక్ ఇంటికి వస్తాడు. వెంటనే నోటీసులు వెళ్లి చూపిస్తుంది. సుమిత్ర వాళ్లు కూడా కార్తీక్ దగ్గరికి వస్తారు. ఈ విషయం శౌర్యకి చెప్పొద్దని కార్తీక్ అనగానే.. ఎందుకు ఏమైందని దీప అడుగుతుంది. అంటే ఇప్పటికే శౌర్య ఆరోగ్యం బాలేదు కదా అందుకే అంటున్నానని కార్తీక్ అంటాడు . మీరేం కంగారుపడకండి దీప.. నాకు తెలిసిన లాయర్ ఉంది.. నేను మాట్లాడుతానని కార్తీక్ అనగానే.. ఇప్పుడు దీపని తీసుకొని వెళ్ళమని సుమిత్ర అంటుంది. శౌర్యని నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళమని దీపకి సుమిత్ర చెప్తుంది. మరొకవైపు మనం దీప దగ్గరికి వెళ్లి.. నువ్వు ఇక్కడ ఉంటే నా కొడుకు జీవితం మేమ్ కోరుకున్నట్లు ఉండేలా లేదు వెళ్లిపోమందామని శ్రీధర్ అనగానే.. వద్దని కాంచన అంటుంది. ఆ తర్వాత దీప, కార్తీక్ లు వెళ్తుంటే మధ్యలో నర్సింహా అప్పులు చేసిన వాళ్ళు ఎదరు పడి అడుగుతుంటారు. నీ భర్తని తీసుకొని వస్తానంటూ వచ్చి రాలేదు.. మా అప్పులు అంటూ గొడవచేస్తారు. నర్సింహా అడ్రెస్ చెప్తాను అక్కడికి వెళ్ళండి అని దీప అంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళమంటావా అంటూ వాళ్ళు దీప పైన కోప్పడతారు. అప్పుడే కార్తీక్ కార్ దిగి వస్తాడు. అదంతా నరసింహా దూరం నుండి చూస్తూ.. ఇదంతా నా సెటప్పేరా అని అనుకుంటాడు. అందరు దీపని తిడుతుంటే.. మీకు ఎంతివ్వాలి.. అలా తిడతారా అంటూ వాళ్ళ అప్పులు అన్ని కార్తీక్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక ఇదంతా ఆ నర్సింహా ప్లాన్ అయి ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉన్నావని వాళ్ళకెలా తెలుసని కార్తీక్ అంటాడు. దీప పడిపోతుంటే కార్తీక్ పట్టుకుంటాడు. అదంతా నర్సింహా వీడియో తీస్తుంటాడు. ఆ తర్వాత ఇప్పుడేం వస్తావ్.. నువ్వు ఇంటికి వెళ్ళు నేను లాయర్ తో మాట్లాడతానని కార్తీక్ అంటాడు.

మరొకవైపు శౌర్య నాన్నతో ఉన్నట్లు గీసిన బొమ్మలలో ఉన్న నాన్న బొమ్మని చింపేస్తుంది. అప్పుడే శౌర్యకి పాలు తీసుకొని వస్తుంది దీప. అక్కడ చింపేసిన ముక్క చూస్తుంది. అమ్మ ఆ బూచోడు మనకి వద్దని శౌర్య అంటుంది. ఆ తర్వాత రేపు బయట నాకు పని ఉంది రావడానికి లేట్ అవుతుంది. అమ్మమ్మ దగ్గర ఉండమని దీప చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.