English | Telugu
Eto Vellipoyindhi Manasu: అమ్మ కోసం భార్యకి వచ్చిన జాబ్ ని భర్త వదిలేయమంటాడా!
Updated : Jul 17, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -150 లో.... సందీప్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడని శ్రీవల్లి హడావిడి చేస్తుంది. ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అయ్యావా అని సందీప్ ని సీతాకాంత్ అడుగుతాడు. అయ్యానని సందీప్ చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ వెళ్తుంటే రామలక్ష్మి ఎదురువస్తుంది. సందీప్ వెళ్తుంటే శ్రీవల్లి హారతి ఇచ్చి పంపిస్తుంది. కావాలనే శ్రీలత ఇక నేను అనుకున్నట్లే జరుగుతుందని సందీప్ తో శ్రీలత అంటుంది. దంతో అలా ఎందుకు అంటుందని రామలక్ష్మి డౌట్ పడుతుంది.
ఆ తర్వాత సందీప్ ఆఫీస్ కి వెళ్తాడు. తనతో పాటు ఇంటర్వ్యూ కి కొంతమంది వస్తారు. వీల్లలో నేను ఎలా సెలక్ట్ అవుతాను.. అసలు అమ్మ ఎవరిని ఏర్పాటు చేసిందని సందీప్ అనుకుంటుండగా.. అప్పుడే ఒకతను వచ్చి సందీప్ ని పక్కకి పిలిచి.. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇస్తాడు. మిగతా వాళ్ళు కూడా నేను ఏర్పాటు చేసినవాళ్ళే అసలు వాళ్ళు సమాధానం చెప్పరని సందీప్ తో అతను అంటాడు. మరొకవైపు అసలు ఎందుకు అలా అంటుందని రామలక్ష్మి ఆలోచిస్తుంటుంది. అప్పుడే పెద్దాయన ఆఫీస్ కి వెళ్తుంటే అతన్ని ఆపి జనరల్ మేనేజర్ పోస్ట్ ఎలా ఉంటుందని అడుగగా.. అది ఆఫీస్ లోనే ఇంపార్టెంట్ పోస్ట్.. దానివల్లే కంపెనీ రిపీటేషన్ బాగుంటుందని చెప్తాడు. ఈ జనరల్ మేనేజర్ పోస్ట్ ని అడ్డుపెట్టుకొని ఆఫీస్ కి లాస్ తీసుకొని రావాలని ట్రై చేస్తున్నారు.. అది సీతా సర్ పైకి వచ్చేలా చేద్దామని అనుకుంటున్నారని రామలక్ష్మి అనుకొని వెంటనే దాన్ని ఆపాలనుకుంటుంది.
ఆ తర్వాత మాణిక్యానికి రామలక్ష్మి ఫోన్ చేసి.. ఏదో చెప్తుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంటుంది. మరొకవైపు రామలక్ష్మికి సంబంధించి అప్లికేషన్ ని మాణిక్యం రెడీ చేస్తాడు. ఆ తర్వాత సందీప్ ఇంటర్వ్యూలో సెలక్ట్ అయ్యారని చెప్తాడు. అప్పుడే మాణిక్యం ఇంకొకరున్నారని చెప్తాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ఆ తర్వాత ఆ పోస్ట్ కి రామలక్ష్మి సెలక్ట్ అవుతుంది. ఆ విషయం శ్రీలతకి సందీప్ ఫోన్ చేసి చెప్తాడు. రామలక్ష్మి, మాణిక్యం ఇద్దరు ఆ విషయం సీతాకాంత్ దగ్గరికి వెళ్లి చెప్తారు. నువ్వు సెలక్ట్ కావడం చాలా హ్యాపీగా ఉంది కానీ అమ్మ సందీప్ కి రావాలని అనుకుంటుంది కదా.. ఏమైనా అనుకుంటుదేమో.. నువ్వు ఇంటర్వ్యూ కి రాకుండా ఉంటే బాగుండని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.