English | Telugu

Guppedantha Manasu : మరదలికి పెళ్ళి చూపులు.. వదిలెల్లిపోయిన ఆ ఇద్దరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1128 లో....మినిస్టర్ గారు ఎండీ గురించి బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. నేను మనుకి ఎండీ బాధ్యతలు ఇద్దామని నిర్ణయం తీసుకున్నానని మినిస్టర్ అంటాడు. మీరు తనని ముందు ఉండి నడిపించండి అని మినిస్టర్ అనగానే.. అందుకు నేను సిద్ధంగా లేనని మను అంటాడు. అది విని అందరు షాక్ అవుతారు. శైలేంద్ర మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతేకాకుండా నేను బోర్డు మెంబర్ గా రిజైన్ చేస్తున్నాని మను చెప్పి వెళ్ళిపోతాడు. అసలు ఏంటి ఇలా జరుగుతుంది.. ఫస్ట్ రిషి తర్వాత వసుధార, ఇప్పుడు మను ఇలా వదిలేసి వెళ్తున్నారు ఏంటని మినిస్టర్ అంటాడు.

నేను కాలేజీని సమర్ధవంతంగా ముందు కు నడుపుతాను ఎండీ పదవి నాకు ఇవ్వండని శైలేంద్ర అనగానే.. చెప్పాను కదా ఆ వసుధార వచ్చి చెప్తేనే నీకు ఎండీ పదవి అని మినిస్టర్ అంటాడు. మరొకవైపు రాధమ్మ దగ్గరికి సరోజ వచ్చి.. చూసావా ఇప్పుడేం జరిగిందో, అందుకే నీకు తోడుగా ఒకరు ఉండాలని సరోజ అంటుంది. ఇప్పుడు ఏమైంది ఆ అమ్మాయి ఉంది కదా అని రాధమ్మ అంటుంది. తను వర్క్ చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ఇక నిన్నేం పట్టించుకుంటుంది.. నన్ను బావ పెళ్లి చేసుకుంటే.. నేనెప్పుడు నీతోనే ఉంటాను కదా అన్ని పనులు చేస్తానని సరోజ అంటుంది. అప్పుడే సరోజ నాన్న సంజీవయ్య వస్తాడు. ఇప్పుడెలా ఉన్నారు అత్తయ్య అని రాధమ్మని అడుగుతాడు. ఇంకా నయం నా వడ్డీ డబ్బులు ఎగపెడతారేమో అనుకున్నానని అంటాడు. రేపు సరోజకి పెళ్లి చూపులు అని అనగానే... నాన్న నాకు వద్దని సరోజ అంటుంది.

మరొకవైపు మహేంద్ర డల్ గా ఉంటే అప్పుడే ఫణింద్ర వచ్చి.. మను ఇలా చేయడమేంటని అడుగుతాడు. వాళ్ళు అసలు కాలేజీలో గాని నా జీవితంలో ఉండాలనుకోవడం లేదు.. నిన్నే వెళ్లిపోయారని మహేంద్ర అంటాడు. నువ్వు ఒక్కడివే ఎందుకు అక్కడ.. మా దగ్గరికి రా అని ఫణీంద్ర అంటాడు. నేను రానని మహేంద్ర అంటాడు. మరొకవైపు నా పెళ్లి చూపులు చెడగొట్టు బావ అని సరోజ రంగాని అడుగగా.. నా వల్ల కాదని రంగా అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిసిందే.