English | Telugu

Karthika Deepam2 : పెళ్ళి క్యాన్సిల్ చేయమని కార్తిక్ చెప్పగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -98 లో... ఇన్నిరోజులు జ్యోత్స్న అంటే ఇష్టం లేదని అందరికి చెప్పి ఉంటే బాగుండు.. సిచువేషన్ ఇక్కడి దాకా వచ్చేది కాదని కార్తీక్ ఫీల్ అవుతుంటాడు. నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు.. ఎవరికి నా బాధ చెప్పాలని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత శౌర్య ఇల్లు కడుతు ఆడుకుంటుంది. ఎందుకు కడుతున్నావని దీప అనగానే.. మనకు సొంతమైన ఇల్లు లేదు కదా అని శౌర్య అంటుంది. మనకి ఊళ్ళో ఉంది కదా అని దీప అంటుంది. ఎక్కడ ఉండనిస్తలేవు కదా.. అన్ని ఇల్లులు తిప్పుతున్నావ్.. ఇక్కడైనా ఉంచుతావో లేదో అని శౌర్య అంటుంది.

ఆ తర్వాత కార్ సౌండ్ విని శౌర్య కార్తీక్ వచ్చాడని అనుకుంటుంది. నీ ఫ్రెండ్ కి నీపై ప్రేమ ఉంటే వచ్చేవారని కావాలనే కార్తీక్ గురించి శౌర్యకి చెప్తుంది దీప. ఎలాగైనా శౌర్యని తీసుకొని ఊరికి వెళ్ళాలి.. అప్పుడే కార్తీక్ బాబుని మార్చిపోతుందని దీప అనుకుంటుంది. ఆ తర్వాత కాంచన ఎంగేజ్ మెంట్ కి సంబంధించిన లిస్ట్ ప్రిపేర్ చేస్తుంటే.. కార్తీక్ వస్తాడు. నేను దాన్నే కాన్సిల్ చెయ్యడానికి వెళ్తున్నానని మనసులో అనుకొని.. ఒక పనిమీద బయటకు వెళ్తున్నాను ఆశీర్వాదం ఇవ్వండని కాంచన దగ్గర కార్తీక్ ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ గురించి శౌర్య ఆలోచిస్తుంటుంది. నాకు చిన్న పని ఉంది.. బయటకి వెళ్లి వస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకని శౌర్యకి దీప చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి వెళ్ళాలని శౌర్య అనుకొని బయల్దేరుతుంది.

మరొకవైపు సుమిత్ర దగ్గరికి కార్తిక్ వస్తాడు. మమ్మీ లేదని జ్యోత్స్న చెప్తుంది. ఏంటి మమ్మీతో ఏం మాట్లాడాలని జ్యోత్స్న అనగానే.. జీవితం గురించి అని కార్తీక్ అంటాడు. నేను అత్తయ్య వచ్చేవరకు వెయిట్ చేస్తానని కార్తీక్ అంటాడు. మరొకవైపు కార్తీక్ కోసం శౌర్య వెతుక్కుంటూ వస్తుంది. అదేసమయంలో దీప ఇంటికి వెళ్లేసరికి శౌర్య ఉండదు. దాంతో శౌర్య గురించి దీప టెన్షన్ పడుతూ వెతుక్కుంటు వెళ్తుంది. మరొకవైపు ఒంటరిగా ఉన్న శౌర్యని నర్సింహా చూసి వెంబడిస్తుంటే.. బయపడి ఒక దగ్గర దాక్కుంటుంది శౌర్య. నర్సింహా వెళ్ళిపోయాక బూచోడు వెళ్ళిపోయాడని శౌర్య అనుకుంటుంది. మరొకవైపు శౌర్య గురించి దీప బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.