English | Telugu
Eto Vellipoyindhi Manasu : అత్త కపటనాటకం.. కోడలు బయటపెట్టగలదా!
Updated : Jul 16, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -149 లో.. తను అనుకున్న బిజినెస్ ని చేసుకోవడానికి ధనకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇస్తాడు సీతాకాంత్. దాంతో ధన, సిరిలు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరోవైపు సందీప్ ని జనరల్ మేనేజర్ ని చెయ్యడానికి శ్రీలత ప్లాన్ వేసింది. అందులో భాగంగా శ్రీవల్లి, సందీప్ ని సీతాకాంత్ తో మాట్లాడమని పంపిస్తుంది. మీరు ఇంటికి ఇల్లరికం వచ్చిన ధనకి ఒక దారి చూపిస్తున్నారు. అలాంటిది మీ తమ్ముడికి కూడ ఒకదారి చూపించండని సీతాకాంత్ ని శ్రీవల్లి అడుగుతుంది.
ఏ పని లేకుండా ఇలాగే తయారు అవుతారు. అందుకే ఆఫీస్ లో జనరల్ మేనేజర్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి కదా.. ఆ పోస్ట్ మా ఆయనకి ఇప్పించండని శ్రీవల్లి అంటుంది. అవును అన్నయ్య ఇకమీదట ఎలాంటి తప్పు చెయ్యనని సందీప్ అంటాడు. ఆ పోస్ట్ కి సందీప్ సరిపోడు.. దానికి మంచి చదువు, తెలివి కావాలి.. కావాలంటే ఏ ఫ్యూన్, అటెండర్ లాంటివి చూడు అని పెద్దాయన అంటాడు. అలా అంటారేంటని శ్రీవల్లి అంటుంది. మావయ్యగారు చెప్పింది నిజమే.. సందీప్ ఆ పోస్ట్ కి సరిపోడని శ్రీలత అంటుంది. ఏది ఎవరికి ఇవ్వాలో అన్నయ్యకి బాగా తెలుసు.. ఎవరు చెప్పనవసరం లేదని సిరి అంటుంది. నేను కుటుంబం వాళ్ళని చూడను.. టాలెంట్ ని మాత్రం చూస్తాను.. రేపు నువ్వు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వు.. నువ్వు సక్సెస్ అయితే జాబ్ వస్తుంది. లేదంటే లేదని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత నేను అంత చదువుకోలేదు.. అంత పెద్ద జాబ్ కి ఇంటర్వ్యూ ఏ లెవెల్ లో ఉంటుందో.. నాకు భయం లగా ఉందని సందీప్ భయపడుతుంటే.. నిన్ను అలా ఎలా వదిలేస్తానురా నిన్ను జనరల్ మేనేజర్ గా చూడాలి అనుకున్నాను అంతే.. ఇంటర్వ్యూ చేసేవాల్లలో ఒకరు మనవాళ్ళు ఉంటారు. నీకు జాబ్ వచ్చినట్టే అని శ్రీలత అంటుంది.
ఆ తర్వాత రామలక్ష్మి ఏదో ఆలోచిస్తుంటుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి కాఫీ తీసుకొని రమ్మని చెప్తాడు. అయిన రామలక్ష్మి పట్టించుకోదు. మళ్ళీ పిలుస్తాడు మీరు నిజంగానే ఆ పోస్ట్ మీ తమ్ముడికి ఇస్తారా అని రామలక్ష్మి అడుగుతుంది. సెలక్ట్ అవుతూనే ఇస్తామని సీతాకాంత్ అంటాడు. కాసేపటికి సీతాకాంత్ ఆఫీస్ కి రెడీ అవుతాడు. ఇంటర్వ్యూకి వెళ్తున్నాడని సందీప్ ని రెడీ చేస్తుంది శ్రీవల్లి. నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యావా అని సందీప్ ని సీతాకాంత్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.