English | Telugu

Brahmamudi : కొంపముంచిన బంటు.. కథ మళ్ళీ మొదటికి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -462 లో... సుభాష్ ఇచ్చిన చీరని అపర్ణ పనిమనిషికి ఇవ్వడంతో సుభాష్ బాధపడతాడు. దాంతో అపర్ణ దగ్గరకి సుభాష్ వెళ్లి మాట్లాడగా.. తను సుభాష్ బాధపడే విధంగా మాట్లాడుతుంది. దాంతో కావ్య వెళ్లి అపర్ణకి నచ్చజెప్పాలని చూస్తుంది. నువ్వు నాకే ఎదురు మాట్లాడుతున్నావా అంటూ అపర్ణ కోప్పడుతుంది. ఇది నా కాపురానికి సంబంధించిన విషయమని అపర్ణ అంటుంది.కానీ మీరు మర్చిపోయి మామయ్యని అర్ధం చేసుకోండని కావ్య అంటుంది.

రాజ్ తప్పు చేస్తే నువ్వు ఊరుకునేదానివా.. నువ్వు రాజ్ తప్పు చెయ్యడని నమ్మావ్.. ఒకవేళ తప్పు చేసాడని నిరూపణ అయితే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అన్నావని అపర్ణ అంటుంది.‌నా నమ్మకం పోయింది అంతే అని అపర్ణ అంటుంది. మరోవైపు అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేస్తుంటే తను లిప్ట్ చెయ్యదు. అప్పుడే స్వప్న వెళ్తుంటే.. కళ్యాణ్ పిలిచి అప్పు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. నీ ఫోన్ ఇవ్వమని అంటాడు. ఫోన్ మాట్లాడ్డం ఇష్టం లేక చెయ్యట్లేదు.. నువ్వు ప్రాబ్లెమ్ ని మళ్ళీ పెద్దగా చెయ్యకని స్వప్న అంటుంది. అప్పుడే రాహుల్ వచ్చి ఒకసారి అప్పు తో మాట్లాడించవచ్చు కదా అని స్వప్నతో అంటాడు. మీకేం తెలుసంటూ రాహుల్ పైకి‌ స్వప్న విరుచుకుపడుతుంది.‌ మరొకవైపు రాహుల్, రుద్రాణి లు కలిసి కళ్యాణ్ సెట్ అయి ఆఫీస్ కి వెళ్తే పరిస్థితి ఏంటని అనుకుంటారు. ఆ తర్వాత ఇక అమ్మానాన్న కలవరంటావా అని కావ్యని రాజ్ అడుగుతాడు. మొన్న మీరు నాకేదో చెప్తానన్నారు.. ఏంటి అది అని కావ్య అడుగుతుంది. నువు కళ్ళు మూసుకోమని కావ్యతో రాజ్ అనగానే.. కావ్య కళ్ళు మూసుకుంటుంది. తనలోని ప్రేమని చెప్పాలని ట్రై చేస్తాడు. అప్పుడే కావ్య వాష్ రూమ్ కు కెళ్ళి వచ్చి రేపు కళ్ళు మూసుకుంటాను.. రేపు చెప్పండి అంటూ పడుకుంటుంది.

మరుసటిరోజు ఉదయం అప్పు, బంటీలు బయటకు వెళ్తే.. అక్కడ కొంతమంది అబ్బాయిలు అప్పు గురించి తప్పుగా మాట్లాడతారు. మాతో కూడా హోటల్ కి వస్తావా అని వాళ్ళు అనగానే.. అప్పు కోపంగా వాళ్ళ తల పగులగోడుతుంది. ఆ తర్వాత అప్పు స్టేషన్ లో ఉంటుంది. ఆ విషయం కళ్యాణ్ కి బంటు ఫోన్ చేసి చెప్తాడు‌ హడావిడి గా కళ్యాణ్ వెళ్తుంటే.. ఎక్కడికి అని ధాన్యలక్ష్మి అంటుంది. బయటకు వెళ్తున్నానని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.