English | Telugu
‘ఆ శ్రీరాముడికి ఒక లక్ష్మణుడు.. నాకు ఇద్దరు లక్ష్మణులు’!
Updated : Sep 19, 2022
'ఆట' షోతో స్టార్ అయ్యాడు. చిన్నవాళ్లకు, పెద్దవాళ్లకు యూనివర్సల్ అన్నయ్యగా మారిపోయాడు. తన షోస్ లో ఒక క్రియేటివిటీతో ముందుకు దూసుకెళ్తూ తనకు డాన్స్ రాకపోయినా 'డాన్స్ ఐకాన్' పేరుతో ఒక డాన్స్ షో చేస్తూ ఆడియన్స్ తో మంచి బాండింగ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి ఓంకార్. ఆయన తన లైఫ్ కి సంబంధించి, షోస్ కి సంబంధించి ఎన్నో విషయాలు ఒక ఇంటర్వ్యూ లో షేర్ చేసుకున్నాడు.
"ఆ శ్రీరాముడికి ఒక లక్ష్మణుడు ఐతే నాకు ఇద్దరు లక్ష్మణులు. వాళ్ళే.. నా తమ్ముళ్లు. నాకు పేరొస్తుందని వాళ్లకు రావడం లేదని ఎప్పుడూ బాధపడరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకోవడం కంటే కూడా నా తమ్ముళ్ళతోనే ఆడుకునేవాడిని. స్కూల్ కి వెళ్ళేటప్పుడు చిన్న తమ్ముడిని ముందు, పెద్ద తమ్ముడిని వెనక ఎక్కించుకుని వెళ్ళేవాడిని. నా మాట చిన్నప్పటినుంచీ వాళ్ళు జవదాటరు. నా ప్రోగ్రామ్స్, మూవీస్ లో ఏది సక్సెస్ ఐనా కూడా దాన్ని నా సక్సెస్ అని కాకుండా ఇది మా ఫ్యామిలీ సక్సెస్ గా చూస్తాం. మా ఇంటికి వచ్చిన తమ్ముళ్ల భార్యలు కూడా అర్థం చేసుకునే వాళ్లే వచ్చారు కాబట్టి మా మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు." అని ఆయన చెప్పాడు.
"నాన్న డాక్టర్ ఐనా కూడా పూజలూ, అవీ చేస్తుంటారు. వాటి ఫలితంగా నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. మా ఎవరి మధ్యన ఏ సమస్యలు లేకుండా హ్యాపీగా ఉన్నాం. మా ముగ్గురన్నదమ్ముల పిల్లలు కూడా అంతే బాండింగ్‌తో ఇంట్లో పెరుగుతూ ఉన్నారు. 'ఆట' డాన్స్ షో ద్వారా పరిచయమైన వారిలో నేను ఎక్కువగా చూసి గర్వపడేది ఆట సందీప్, లుక్స్ రాజశేఖర్, మల్లేష్.. 'ఆట జూనియర్స్'లో గీతిక నా ఆల్ టైం ఫేవరేట్. నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక గాడ్‌ఫాదర్ అల్లు అరవింద్ గారు. నా ఎదుగుదలలో ఆయనదే ముఖ్య భాగం. అని వెల్లడించాడు.
"ఇక నా షోస్ విషయానికి వస్తే.. 'మాయాద్వీపం' షోలో ప్రతీ ఒక్కరు నన్ను అన్నయ్య అనే పిలుస్తుండటంతో అందరితో బాండింగ్ కుదిరింది. నాకు ఒక కొత్త లైఫ్ ఇచ్చింది 'ఆట'. సెకండ్ ఇన్నింగ్స్ ని 'సిక్స్త్ సెన్స్' ద్వారా స్టార్ట్ చేసాను. 'ఇష్మార్ట్ జోడి' అనేది ఒక ఇన్స్పిరేషనల్ బాండింగ్ షో. నా కెరీర్ లో ది టాప్ మోస్ట్ షో డాన్స్ ఐకాన్. " అంటూ ఓంకార్ ఎన్నో విషయాలను పంచుకున్నాడు.