English | Telugu

అఖిల్‌తో నాది జన్మజన్మల బంధం.. నేను ఆయన భక్తురాలిని!

'జరీ జరీ పంచెక‌ట్టి' సాంగ్ తో సోషల్ మీడియాలో ఈ మధ్య ఫుల్ ఫేమస్ ఐన యాంకర్ విష్ణు ప్రియ. బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్‌తో కలిసి ఈమె వేసిన మాస్ స్టెప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. విష్ణుప్రియ యాంకర్ నుంచి యాక్టర్‌గా మారాలని ట్రై చేస్తోంది. అందుకే ఇటీవల ఇన్స్టాగ్రామ్‌లో చాలా హాట్ ఫొటోస్ పెట్టి డైరెక్టర్స్ దృష్టిలో పడడానికి ప్రయాసలు పడుతోంది. ఐతే ఇటీవల ఈమె ఒక ఇంటర్వ్యూలో అఖిల్ అక్కినేని గురించి సంచలన కామెంట్స్ చేసింది.

ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "అఖిల్ అక్కినేనితో సినిమా తీసే డైరెక్టర్స్ ఎవరో కానీ.. ప్లీజ్ నాకు అతనితో కలిసి నటించే ఛాన్స్ ఇవ్వండి. ఎట్లీస్ట్ ఏదైనా స్పెషల్ సాంగ్ లో చేసే అవకాశం అన్నా ఇవ్వండి. ఎందుకంటే నేను కొంచెం డాన్స్ బానే చేస్తాను. అఖిల్ అంటే నాకు పిచ్చి. అది ఎందుకు అంటే నేను చెప్పలేను. కానీ నేను గత జన్మ నుంచి ఆయన భక్తురాలిని.. ఈ జన్మలో అది కొనసాగుతోంది. నాది, అఖిల్ అక్కినేనిది జన్మ జన్మల బంధం" అంటూ హాట్ కామెంట్స్ చేసింది.

ఇక తన డాన్స్ వీడియోస్ చూసిన డైరెక్టర్ సుకుమార్ గారు "ఎందుకు డాన్స్ ఆపేశావ్.నేను నీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను. చేస్తూనే ఉండు" అనడం తన లైఫ్ లో బెస్ట్ కంప్లిమెంట్ అని చెప్పింది విష్ణుప్రియ. శ్రీముఖి గురించిన ప్రశ్న అడిగినప్పుడు "శ్రీముఖి అంటే నాకు ప్రేమ.. ఒకవేళ తను అబ్బాయి అయ్యుంటే నేను పెళ్లి చేసుకునే దాన్ని. కానీ అమ్మాయైపోయింది" అని చెప్పింది విష్ణు. ఇక ఈమె సుధీర్‌తో క‌లిసి 'పోవే పోరా' షో ద్వారా తన కెరీర్‌ను స్టార్ట్ చేసిందన్న విషయం తెలిసిందే.