English | Telugu
మోనిత ట్రాప్‌లో డాక్టర్ బాబు!
Updated : Feb 22, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలంగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తున్న ఈ సీరియల్ తాజాగా రసవత్తర మలుపులు తిరుగుతోంది. ఈ మంగళవారం 1282వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ రోజు మోనిత ఆడే ఆట మొదలు కాబోతోంది. మరో సారి డాక్టర్ బాబుని అడ్డంగా బుక్ చేయాలని ప్లాన్ చేస్తోంది. తన బాబు కార్తీక్ దగ్గరే వున్నాడని తెలుసుకున్న మోనిత ఆసుపత్రికి వస్తుంది. అక్కడే డాక్టర్ బాబు, దీప వుంటారు.
అక్కడికి వచ్చిన మోనిత మళ్లీ తన మాటలతో డాక్టర్ బాబుని ఆడుకోవడం మొదలుపెడుతుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన డాక్టర్ బాబు.. దీప చూస్తుండగానే మోనిత చెంప ఛెళ్లుమనిపిస్తాడు. అయినా ఆగని మోనిత తాళి చూపించి భర్తవని మళ్లీ రెట్టించడంతో వెంటనే మోనిత చూపిస్తున్న తాళిని తెంచేసి తన ముఖాన్నే కొట్టి షాకిస్తాడు. ఏం జరుగుతోందో దీప తెలుసుకునే లోపే అంతా జరిగిపోతుంది. తన కొడుకుని తనకు అప్పగిస్తే మీ జోలికి రానని చెబుతుంది మోనిత.
Also Read:ఆపరేషన్ పేరుతో బాబాయ్‌కి స్పాట్ పెట్టిన మోనిత
తన బాబాయ్ ఆపరేషన్ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపిన మోనిత.. బాబు పేరుతో డాక్టర్ బాబుని ట్రాప్ లో పడేసే ప్లాన్ చేస్తుంది. ఇది గమనించిన దీప దాని మాటలు నమ్మొద్దని చెబుతున్నా డాక్టర్ బాబు వినకుండా 'నీ బాబుని నీకు తెచ్చిస్తాను అదే మాటమీద నిలబడతావా?' అని ప్రశ్నిస్తాడు. అందుకు మోనిత ఓకే అంటుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆపరేషన్ పేరుతో మోనిత తన బాబాయ్ ని.. కార్తీక్ కు తెలియకుండా హత్య చేయించే ప్లాన్ చేసిందా? .. ఆ ప్లాన్ వర్కవుట్ అయ్యిందా?.. ఇంతకీ ఏం జరగబోతోంది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.