English | Telugu
అషురెడ్డిని ఆడుకున్న నెటిజన్స్.. ఏం జరిగింది?
Updated : Feb 22, 2022
అషు రెడ్డి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటూ ఫొటో షూట్ లు.. వైరల్ వీడియోలు చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ సీజన్ 3తో పాపులర్ అయిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్ 3లో అషు రెడ్డి చేసిన హంగమా అంతా ఇంతా కాదు. ఈ షో కారణంగా మరింత పాపులర్ అయిన అషురెడ్డి ప్రస్తుతం పలు టీవీ షోల్లో పాల్గొంటూ ఆకట్టుకుంటోంది. బిగ్‌బాస్ షో తరువాత తనకు అంది వచ్చిన అవకాశాన్ని సొంతం చేసుకుంటూ నెట్టింట వైరల్ గా మారింది.
ఇదిలా వుంటే డబ్స్ మాష్ వీడియోలతో నెట్టింట హల్ చల్ చేసిన అషురెడ్డి గత కొన్ని రోజులుగా హాట్ హాట్ ఫొటో షూట్ లతో సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. చిత్ర విచిత్రమైన భంగిమలతో ఫొటోలకు పోజులిస్తూ నెట్టింట వైరల్ గా మారింది. బ్లాక్ అండ్ వైట్ చెక్స్ డెనిమ్ షర్ట్ వేసుకుని బటన్ విప్పేసి నెట్టింట సందడి చేసిన అషురెడ్డి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో వైరల్ గా మారింది. చిరిగిన షర్ట్ లా కనిపిస్తున్న డెనిమ్ షర్ట్ వేసుకున్న అషురెడ్డిపై నెట్టింట సెటైర్లు వినిపిస్తున్నాయి.
Also Read:'దృశ్యమ్ 2' షూటింగ్ మొదలుపెట్టిన అజయ్ దేవ్‌గణ్, శ్రియ
చినిగిన చొక్కా తో వున్న ఫొటోని షేర్ చేసిన అషురెడ్డి `చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఒక పెద్దాయన చెప్పాడు` అంటూ సదరు ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై నెటిజన్ లు సెటైర్లు వేస్తున్నారు. పాపం వీధి కుక్కలు దాడిచేసాయేమో చొక్కా మొత్తం చినిగింది` అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మందేమో చినిగిన చొక్కా వేసుకున్నావ్ సరే.. మరి పుస్పకం కొన్నావా? .. షర్ట్ మరీ ఇలా చిరిగిపోయిందేంటీ? అంటూ ట్రోల్ చేస్తున్నారు.