English | Telugu

Divya Elimination:దివ్య ఎలిమినేషన్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్!

బిగ్ బాస్ సీజన్-9 లో పన్నెండో వారం నామినేషన్లో మొత్తంగా ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. నిన్నటి వరకు ఫ్యామిలీ వీక్ సాగగా కంటెస్టెంట్స్ అందరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే నామినేషన్లో ఉన్నవారిలో కళ్యాణ్ టాప్ లో ఉండగా రెండో స్థానంలో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. మూడో స్థానంలో భరణి ఉన్నాడు.

డేంజర్ జోన్ లో‌ డీమాన్ పవన్, సంజనా గల్రానీ, దివ్య నిఖిత ఉన్నారు. ఇక వీరిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారని ఓటింగ్ చూస్తే దివ్యకి వీరిద్దరి కంటే లీస్ట్ ఓటింగ్ పడింది. ఇక నిన్నటితో ఓటింగ్ ముగియగా.. దివ్య 8.05 శాతం ఓటింగ్ తో చివరి స్థానంలో ఉంది. సంజనా గల్రానీ 8. 91 శాతం ఓటింగ్ తో ఆమె కన్నా ఒక్క స్థానం పై‌న ఉంది. ఇక వీరిద్దరి కన్నా కాస్త ఎక్కువగా పది శాతం ఓటింగ్ తో డీమాన్ పవన్ ఉన్నాడు. ఇక హౌస్ లో ఉన్నవారిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో డీమాన్ పవన్ ఫస్ట్ ఉంటాడు. ఆ తర్వాత దివ్య ఉంటుంది‌. దివ్య స్ట్రాటజీ పర్ ఫెక్ట్ ఉంటుంది. అయితే తనకి ఓట్ బ్యాకింగ్ తక్కువగా ఉంది. తనూజ, కళ్యాణ్ లకి ఉన్నంత పీఆర్ టీమ్ దివ్యకి లేకపోవడం పెద్ద మైనస్.

అయితే బిగ్ బాస్ కి సంజనా గల్రానీ ప్రియమైన కంటెస్టెంట్. తనని ఎలిమినేట్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే తను గేమ్ ఆడినా ఆడకపోయినా పదకొండు వారాలు ఉంచాడు బిగ్ బాస్. డీమాన్ పవన్ ని ఎప్పుడెప్పుడు పంపించాలా అని బిగ్ బాస్ చూస్తున్నాడు కానీ రీతూ కెప్టెన్ అయింది కాబట్టి తను డీమాన్ కి ఫేవరెటిజం చూపిస్తే మిగిలిన కంటెస్టెంట్స్ గొడవ పడతారు‌. సో కంటెంట్ వస్తుంది. అందుకని డీమాన్ ని ఎలిమినేట్ చేయలేడు బిగ్‌బాస్. ఇక మిగిలింది దివ్యనే.. దివ్యకి ఓట్ బ్యాంకింగ్ లేకపోగా.. తనూజకి దివ్యకి పడటం లేదు.. అందులోని బిగ్ బాస్ దత్తపుత్రిక తనూజ. తనూజ ఏం చేసిన రైట్.. దివ్య ఏం చేసినా రాంగ్.. ఫస్ట్ నుండి అదే పోట్రే చేస్తున్నాడు బిగ్ బాస్. దీన్ని బట్టి చూస్తే ఈ వారం తనూజ ఖాతాలో దివ్య బలి కానుందా లేదా తెలియాలంటే మరో రెండు రోజులు చూడాల్సిందే.