English | Telugu
Brahmamudi : పెళ్ళిచూపుల గొప్పతనం చెప్పిన ఇందిరాదేవి.. రాహుల్ కోసం స్వప్న ఏడుపు!
Updated : Nov 22, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -884 లో.. సుభాష్, అపర్ణ పెళ్లిరోజు సందర్బంగా వాళ్ళకి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. అమ్మాయిని ఒకసారి నడవమనండి అని అబ్బాయి వాళ్ళు అంటారు. దాంతో అపర్ణ నడిచి చూపిస్తుంది. అసలు పెళ్లిచూపులు ఎందుకు ఏర్పాటు చేస్తారు అమ్మమ్మ అని ఇందిరాదేవిని కావ్య అడుగుతుంది. దాంతో ఇందిరాదేవి పెళ్లిచూపుల గొప్పతనం చెప్తుంది. అప్పుడే కోపంగా స్వప్న ఎంట్రీ ఇస్తుంది. చాలా బాగుంది అందరు సరదాగా సంతోషంగా ఉన్నారని స్వప్న అనగానే ఏంటి అలా అంటున్నావ్.. నువ్వు ఇక్కడ మిస్ అయ్యావని అలా అంటున్నావా అని కావ్య, అప్పు అంటారు.
అదేం కాదు నా భర్తకి పేరుకే పెత్తనం ఇచ్చారు. అక్కడ అందరు తనని చూసి నవ్వుతున్నారు. కింద పని చేసేవాళ్ళు కూడా రాహుల్ కి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ఒక్క సంతకం కోసం పంపిస్తున్నారా అని స్వప్న అంటుంది. అదంతా నీ భర్త తప్పు.. ఏదో వాడికి నమ్మి ఒక ఛాన్స్ ఇచ్చామని సుభాష్ అంటాడు. దాంతో నా కొడుకు ఎప్పుడో గతంలో ఒకసారి తప్పు చేస్తే ఇప్పుడు కూడా వాడికి శిక్ష వెయ్యాలా అని రుద్రాణి అంటుంది. అప్పుడే రాహుల్ ఎంట్రీ ఇచ్చి.. మమ్మీ నువ్వు వాళ్ళని ఒక్కమాట అనడానికి వీలు లేదని అంటాడు.
స్వప్న నువ్వు కూడా అనొద్దు.. వాళ్ళు నన్ను ఇప్పుడే నమ్ముతున్నారు.. ఒక ఛాన్స్ ఇచ్చారని రాహుల్ యాక్టింగ్ చేస్తాడు. వాళ్ళ తరుపున నేను మీకు సారీ చెప్తున్నాని రాహుల్ అంటాడు. ఆ తర్వాత స్వప్న బాధపడుతుంటే రాహుల్ తన దగ్గరికి వెళ్తాడు. నేను ఇప్పుడిప్పుడే బాధ్యతలు తెలుసుకుంటున్నాను. మెల్లిగా అన్ని సర్దుకుంటాయని రాహుల్ చెప్తాడు. తరువాయి భాగంలో అమ్మనాన్నలాగా మళ్ళీ మనం పెళ్లి చేసుకుందామా అని కావ్యతో రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ కొత్తగా 'R' అనే అక్షరం కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాడని రాహుల్ కి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.