English | Telugu
మగబిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటులు కోయిలమ్మ సీరియల్ జంట
Updated : Nov 22, 2025
అప్పుడెప్పుడో "నువ్వే కావాలి" మూవీతో ఫేమస్ ఐన సాయికిరణ్ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. ఇక ఇన్నేళ్లకు బుల్లితెర మీద "గుప్పెడంత మనసు" సీరియల్ లో నటించి మళ్ళీ లైం లైట్ లోకి వచ్చారు. అలాంటి సాయికిరణ్ రీసెంట్ గా గుడ్ న్యూస్ చెప్పారు. తమకు 19 వ తేదీన మగబిడ్డ పుట్టినట్లు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు సాయికిరణ్, స్రవంతి జంట. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వీరికి వివాహం జరిగింది. ఏడాది తిరక్కముందే పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు ఇద్దరూ. ఇక ఇద్దరూ బుల్లితెర నటులే కావడంతో వీళ్ళ సహా నటీనటులంతా కూడా కంగ్రాట్స్ అంటూ మెసేజెస్ పెట్టారు. గుప్పెడంత మనసు రక్షా గౌడ, ముకేష్, లహరి, మహేశ్వరీ, సౌందర్య రెడ్డి, అస్మిత ఇలా చాలామంది కూడా కంగ్రాట్స్ చెప్పారు.
ఇక సాయి కిరణ్ కూడా వీళ్ళందరికీ థ్యాంక్స్ అంటూ రిప్లై మెసేజెస్ పెట్టారు. సాయికిరణ్ "నువ్వే కావాలి, ప్రేమించు, మనసుంటే చాలు" వంటి మూవీస్ లో నటించారు. గతంలో సాయికిరణ్ వైష్ణవి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీళ్లకు ఒక పాప కూడా ఉంది. తర్వాత వీళ్ళు విడిపోగా గత ఏడాది తన సహా నటి స్రవంతిని పెళ్లి చేసుకున్నారు. బుల్లితెర మీద "కోయిలమ్మ" సీరియల్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న సాయి కిరణ్ తర్వాత కాలేజీ లవ్ స్టోరీతో తెరకెక్కిన "గుప్పెడంత మనసు" నటించారు. మహేంద్ర భూషణ్ గా ఆడియన్స్ మనస్సులో మంచి స్తానం సంపాదించుకున్నారు. కోయిలమ్మ సీరియల్ లో తనతో కలిసి నటించిన స్రవంతిని ఆయన వివాహం చేసుకున్నారు.