English | Telugu

డేంజర్ జోన్ లో రాజ్, ఫైమా!

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం మొత్తం ఫ్యామీలి వీక్ కావడంతో ఎపిసోడ్స్ అన్నీ కూడా బాగున్నాయి. అయితే ఎలిమినేషన్స్ఓటింగ్లో ఫైమా, రాజ్ తక్కువ ఓటింగ్ తో చివరి స్థానాలలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఫైమా ముందు వారంగేమ్ పరంగా చూస్తే చాలా అన్ ఫెయిర్ గా ఆడింది. ఇంకా ఇనయాతో మాటిమాటికి గొడవ పడడంతోగతవారమే ఎలిమినేషన్ గా బయటకు వచ్చేస్తుందేమోనని అనుకున్నారంతా.. కానీ ఎవరు ఊహించని విధంగా మెరీనాని ఎలిమినేట్ చేసారు. ఇదే కాకుండా హౌస్ లో నాన్ సింక్ కామెడీతో రేవంత్ కి ఇరిటేషన్తెప్పిస్తోంది ఫైమా. అయితే ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ లో చివరి స్థానంలో ఫైమా ఉంది. ఫైమా కంటే కాస్త ఎక్కువ ఓట్లతో ముందు స్థానంలో రాజ్ఉన్నాడని సమాచారం.

మొన్న జరిగిన ఎపిసోడ్‌లో రాజ్ వాళ్ళ అమ్మ హౌస్ లో వచ్చి " అందరితో జాగ్రత్తగా ఉండు. ముఖ్యంగా ఫైమాతో, శ్రీసత్య తో " అని చెప్పింది. అప్పటినుండి వాళ్ళతో గొడవలకి పోకుండా ఉండటం వల్ల ప్రేక్షకుల మద్దతు దొరికినట్టుగా ఓటింగ్ చూస్తుంటే తెలుస్తోంది. అయినప్పటికీ రాజ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఫైమా దగ్గర 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' ఉంది.దీనిని ఉపయోగించుకొని ఫైమా సేవ్ అవుతుందోలేదా ఎవరినైనా సేవ్ చేస్తుందోచూడాలి. ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ లో మాత్రం ఫైమా, రాజ్ ఇద్దరు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది.