English | Telugu

ఇనయా కలని నిజం చేసిన బిగ్ బాస్!


బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఎలాంటి గొడవలకి తావు లేకుండా..ఎమోషన్స్, టాస్క్ లతోఫుల్ జోష్ లోసాగుతోంది. అయితే ఫ్యామిలి వీక్ స్పెషల్ గా జరుగుతున్న ఎపిసోడ్‌లో భాగంగా హౌస్ లో ఇప్పటి దాకా శ్రీసత్య, ఆదిరెడ్డి, రాజ్, ఫైమా వాళ్ళ కుటుంబాలు రావడం చూసాం.

కాగా ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ లో ఇనయాకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు వస్తారన్నది? ప్రేక్షకులకు ప్రశ్నగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే గత కొంత కాలంగా ఇనయాను తన కుటుంబ సభ్యులు దూరం పెట్టారనే విషయం అందరికి తెలియడమే. దీనికి కారణాలు లేకపోలేదు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఇండస్ట్రీకి రావడం. తనకు నచ్చినట్టు ఉండటం వల్ల ఎవరు మాట్లాడం లేదు. రాంగోపాల్ వర్మ తో డాన్స్ చేసిన వీడియో వైరల్ అయినప్పుడు, 'మా పరువు తీసావ్' అంటూ తనని తిట్టారంట. అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఎలాంటి మాటలు లేవని ఓ ఇంటర్వ్యూ లో తనే చెప్పుకొచ్చింది. ఇదే విషయం తను కూడా హౌస్ లో చాలా సార్లు చెప్పింది.

నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఇనయా అమ్మ రావడం, హౌస్ మేట్స్ తో పాటుగా తనని సైతం ఆశ్చర్యపరిచింది. కొంత సమయం దాకా వాళ్ళ అమ్మని హగ్ చేసుకొని ఏడ్చేసింది. ఆ తర్వాత కాళ్ళు పట్టుకొని చాలా సేపు ఏడ్చింది. అమ్మ మాట్లాడుతూ "కప్‌ గెలుచుకొని రా" అని చెప్తుంటే, ఇనయా పొంగిపోయింది. ఆ తర్వాత టైం అయ్యిందని బిగ్ బాస్ ఇనయా వాళ్ళ అమ్మని బయటకు పంపించేయగా, "నా డ్రీమ్ ని నెరవేర్చారు బిగ్ బాస్.. థాంక్స్ బిగ్ బాస్" అని ఇనయా చెప్పింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.