English | Telugu

పబ్లిక్ చెప్పిన బిగ్ బాస్ సీజన్-6 విన్నర్ ఎవరు?

బిగ్ బాస్ సీజన్-6 ఇప్పటివరకు జనాలని ఎంతగానో ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు సీజన్ చివరి దశకు వచ్చేసింది. దీంతో పబ్లిక్ మనసులో ఏం ఉంది తెలుసుకుందామని, ఒక యూట్యూబ్ ఛానెల్ వారు సర్వే నిర్వహించగా పబ్లిక్ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

పబ్లిక్ టాక్ లో ఈ సీజన్ విజేత ఎవరు? అని అడుగగా ఒకరేమో రేవంత్ అని మరొకరు శ్రీహాన్ అని చెబుతున్నారు. అయితే ఎక్కువ మంది చెప్పిన సమాధానం ఏంటంటే, రేవంత్ కొంచెం మాటని ఆచితూచి మాట్లాడితే అతనే ఈ సీజన్ విజేత అని చెప్పుకొచ్చారు. కాగా మరికొందరు మాత్రం ఇనయా ఒక గేమర్ అని తను ఎవరితోనూ వాగ్వాదానికి పోకుండా, గొడవలకు తావు ఇవ్వకుండా, గేమ్ లో పర్ఫామెన్స్ ఇస్తే తనే విన్నర్ అని చెప్పారు.

కీర్తి భట్ కి ఫ్యామిలీ ఎవరు లేకపోవడంతో ప్రేక్షకులు వేసే ఓటింగ్ లో తనకే ఎక్కువ మద్దతు ఇస్తారేమో? అని కూడా చెబుతూ వచ్చారు. కాగా ఇప్పటి వరకు సాగిన ఎపిసోడ్స్ లో కామ్ అండ్ రిజర్వ్ గా ఉన్న రోహిత్ కి విజేత అయ్యే ఛాన్స్ ఉందని పలువురు చెప్పగా, ఒకరైతే 'నేను అసలు బిగ్ బాసే చూడను. అందులో ఎవరు ఉన్నారో కూడా తెలియదు' అని చెప్పారు. అయితే పబ్లిక్ టాక్ లో మిశ్రమ స్పందన రావడంతో ఈ సీజన్ విజేత ఎవరు? అనే విషయంపై ఇంకా స్పష్టత లేకుండా ఉంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.