English | Telugu
రెస్ట్ ఇన్ పీస్.... మిస్ యు సర్!
Updated : Oct 11, 2023
యాదమ్మ రాజు-స్టెల్లా ఈమధ్య బుల్లితెర మీద బాగా కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ‘పటాస్’ కామెడీ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న యాదమ్మ రాజు.. ఆ తర్వాత పలు కామెడీ షోలు చేస్తూ బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుంటున్నాడు...జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ తో ఎంతో పాపులర్ అయిన యాదమ్మ రాజు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెర కామెడీ షోల ద్వారా, యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న వారిలో యాదమ్మ రాజు కూడా ఒకరు. ఆయన కామెడీ టైమింగ్ కి ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు. అలాంటి యాదమ్మ రాజు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రీసెంట్ గా పోస్ట్ పెట్టాడు. " అక్టోబర్ 3 నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు.. ఎందుకంటే నన్ను ఎల్కేజి నుండి 10వ తరగతి వరకు చదువు చెప్పి నేను ఎలా ఉండాలో నేర్పించి ఎనో సార్లు నా తప్పులకి నన్ను కొట్టి సెట్ రైట్ చేసి డిసిప్లిన్ నేర్పించి, స్కూల్ ఫీజులు కట్టలేని టైంలో నా స్కూల్ ఫీజులు కట్టి నన్ను చదివించిన మా ప్రిన్సిపాల్ సర్ ని మిస్ అవుతూనే ఉంటా ...రెస్ట్ ఇన్ పీస్ డా.ఫెడ్రిక్ ఫ్రాన్సిస్ సర్ !ఎంతో మందికీ చదువు చెప్పిన గురువు" అని పోస్ట్ చేసుకున్నాడు.
ఎవరిని ఎవరూ పట్టించుకోని ఈరోజుల్లో యాదమ్మ రాజు మాత్రం తన సర్ ని ఇంకా గుర్తుపెట్టుకుని ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన సర్ మీద చూపిస్తున్న అభిమానానికి నెటిజన్స్ ఖుషీ అవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక యాదమ్మ రాజు తన లైఫ్ లో ఎన్నో కస్టాలు పడి ఈ స్థాయికి వచ్చాడన్న విషయాన్ని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్తూనే ఉంటాడు. స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి ఇంట్లో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. బుల్లితెర మీద ప్రసారమయ్యే అన్ని ఈవెంట్స్ , షోస్ లో ఈ జంట కనిపిస్తూనే ఉంటారు.