English | Telugu
చిన్నాన్న చెప్పినట్టు కృష్ణ కాపురం సరిదిద్దుకోగలదా?
Updated : Oct 11, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -284 లో.. ముకుంద మురారి ఇద్దరు మాట్లాడుకోవడం చూసిన ప్రభాకర్ కోపంగా మురారిని పైకి తీసుకోని వెళ్తాడు. ఏమైందని అందరూ అలాగే చూస్తుంటారు. ముకుంద మాత్రం ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలనే ఎక్సయిట్ తో ఉంటుంది. కాసేపటికి మురారికి పూల షర్ట్ లుంగీ వేసి ప్రభాకర్ తీసుకోని రావడం చూసిన ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తారు.
ఆ తర్వాత ప్రభాకర్ మురారి ఇద్దరు వినాయకుడి ముందు మాస్ డాన్స్ చేస్తారు. మురారి, తన బాబాయ్ తో కలిసి డాన్స్ చేస్తుంటే కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాసేపటికి నువ్వు వెళ్లి అల్లుడుతో కలిసి డాన్స్ చెయ్ అని కృష్ణతో అనగానే కృష్ణ వెళ్తుంటే.. ముకుంద తనని ఆపుతుంది. ఏంటి ఛాలెంజ్ లో ఓడిపోయావ్. డాన్స్ చేస్తావా మా నాన్నని ఇక్కడికి రప్పిస్తాను అన్నావ్ కదా అని అనగానే.. ఇంకా పూజ పూర్తి అవలేదు కదా వెయిట్ వస్తాడని కృష్ణ కాన్ఫిడెంట్ గా చెప్తుంది.
ఆ తర్వాత కృష్ణ మురారి ఇద్దరు డీజే టిల్లు పాటకి మాస్ డాన్స్ చేస్తారు. అ తర్వాత ఇక లడ్డు వేలం పాట అని కృష్ణ చెప్తుంది. లడ్డు వేలం పాటలో ముకుంద, కృష్ణ ఇద్దరు పోటాపోటీగా వేలం పాడతరు. చివరగా ఆరు లక్షలకు ముకుంద లడ్డు వేలం పాట పడుతుంది. కానీ కృష్ణ వేలం పాడదు. చూసావా నేనే గెలిచిన అని ముకుంద అంటుంది. లడ్డు వేలం డబ్బులు ఇప్పుడే ఇవ్వాలని కృష్ణ అనగానే.. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బులు లెవ్వని ముకుంద అంటుంది. ఇక వాళ్ళ నాన్నకి ముకుంద ఫోన్ చేసి డబ్బులు తీసుకోని ఇంటిముందుకి వచ్చాక ఫోన్ చెయ్ అంటుంది. ఆ తరువాత కాసేపటికి ముకుంద వాళ్ళ నాన్న డైరెక్ట్ డబ్బులు తీసుకోని లోపలికి వస్తాడు. ముకుంద వాళ్ళ నాన్న పూజకి వచ్చాడని ప్రభాకర్ కి కృష్ణ చెప్తుంది. నా కూతురు రప్పిస్తానని చెప్పింది రప్పించిందని ప్రభాకర్ అంటాడు. చూసావా నా దగ్గర 600 మాత్రమే ఉన్నాయి కానీ నీ చేత ఆరు లక్షల వరకు పాడించానని కృష్ణ చెప్తుంది.
మరొక వైపు మురారిని కృష్ణ నిద్ర నుండి లేపుతుంది. ఈ రోజు చిన్నాన్న పిన్ని వెళ్లిపోతున్నారు. బట్టలు తీసుకోనీ రావాలని చెప్పగానే మురారి సరేనని చెప్తాడు. ఆ తరువాత ప్రభాకర్, శకుంతల ఇద్దరు బయల్దేరుతుంటే కృష్ణ వాళ్ళకి బట్టలు పెడుతుంది. ఆ తరువాత కృష్ణ వాళ్ళతో బయట వరకు వస్తుంది. ఆదర్శ్ ను త్వరగా వచ్చేలా చెయ్. లేదంటే నీ కాపురం బాగుండదు. నాకు అంత అర్థం అయిందని కృష్ణతో ప్రభాకర్ చెప్తాడు. నేను చూసుకుంటాను చిన్నాన్న అని కృష్ణ చెప్తుంది. కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.