English | Telugu

గీతు రాయల్ కొత్త బిజినెస్.. ఏంటో తెలుసా?

బిగ్ బాస్ ద్వారా ఫ్యాన్ బేస్ ని పెంచుకొని బయటకు వచ్చాక చాలా మంది తమకి నచ్చిన రంగాలలో స్థిరపడుతున్నారు. ఇప్పటికే ఆదిరెడ్డి సొంతంగా సెలూన్ ని స్టార్ట్ చేస్తున్నట్లు తెలియజేశాడు. ఇప్పుడు గీతు రాయల్ తన ఫ్రెండ్స్ తో కలిసి టాటూ స్టూడియో ని మొదలు పెడుతున్నట్టుగా షేర్ చేసింది గీతు రాయల్. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది గీతు.

బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు నాగార్జున. అయితే గీతు ఎంత హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు.

గీతు రాయల్ తన ట్రావెలింగ్ వ్లాగ్స్, స్పెషల్ వ్లాగ్, బర్త్ డే వ్లాగ్ అంటు తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తుంటుంది. వాటికి అత్యధిక వ్యూస్ వస్తుంటాయి. దీంతో పాటుగా ఇన్ స్టాగ్రామ్ లో మోటివేషనల్ కొటేషన్స్ చెప్తూ ఎందరిలోనో స్పూర్తిని నింపుతుంది. అయితే ఇప్పుడు తనొక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పింది. అయితే ఇప్పుడు దాని గురించి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అయింది. అయితే ప్రతీ వారం బిగ్ బాస్ బజ్ ఎగ్జిట్ ఇంటర్వూ చేస్తూ ఫుల్ క్రేజ్ ని తెచ్చుకుంటుంది గీతు రాయల్.