English | Telugu
ఆలీ ఇంట్లో అందాలభామలకు భోజనాలు
Updated : Oct 2, 2021
ఇండస్ట్రీలో హాస్యనటుడు ఆలీ అందరివాడు. ఆయనకు వెండితెరతో పాటు బుల్లితెరలో నటించే తారలతో సత్సంబంధాలు ఉన్నాయి. పైగా, ఆలీ కూడా ‘ఆలీతో సరదాగా’ టాక్ షో చేస్తున్నారు. అప్పుడప్పుడూ కొన్ని షోలకు వెళతారు. తాజాగా బుల్లితెర యాంకర్లు, నటీనటులు కొంతమందిని ఇంటికి పిలిచి భోజనాలు పెట్టారు.
ఆలీ ఇంట్లో వండే బిర్యానీలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. లేటెస్ట్ టీవీ సెన్సేషన్ అషురెడ్డి అదే విషయాన్ని చెప్పింది. ‘థ్యాంక్యూ సో మచ్ ఫర్ వండర్‌ఫుల్ డిన్నర్ ఆలీగారు. బిర్యానీ మేకింగ్ కింగ్’ అని అషురెడ్డి పేర్కొంది. ఆలీ ఇంట్లో భోజనాలు సంగతి కూడా ఆమె బయటపెట్టారు. యాంకర్లు ఉదయభాను, శ్యామల, మృదుల, సావిత్రి, ఫీమేల్ ఆర్టిస్టులు హిమజ, శ్రీవాణి, సోనియా సింగ్ తదితరులు భోజనాలు చేసిన బ్యాచ్‌లో ఉన్నారు. వీళ్లందరూ య్యూట్యూబ్ కోసం ప్రత్యేకంగా వీడియోలు చేస్తున్నవాళ్లే. త్వరలో ఆలీ ఇంట్లో భోజనాల ప్రోగ్రామ్ ఒకటి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.