English | Telugu

రామాకు ఘనస్వాగతం.. కన్నబాబుకు వార్నింగ్!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `జాన‌కి క‌ల‌గ‌న‌లేదు`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంత‌గా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ప్రియాంకా జైన్, అమ‌ర్ దీప్ చౌద‌రి జంట‌గా న‌టించారు. ఇత‌ర కీలక పాత్ర‌ల‌లో న‌టి రాశి, అనిల్ అల్లం, విష్ణు ప్రియ‌, నిఖిల్‌, షీలా సింగ్‌, మ‌హ‌తి, సూర్య‌, మ‌ధు కృష్ణ త‌దిత‌రులు న‌టించారు. ఈ సీరియ‌ల్ తో తొలి సారి న‌టి రాశి బుల్లితెర‌పై న‌టించ‌డం మొద‌లు పెట్టింది. దీంతో ఈ సీరియ‌ల్ పై అంద‌రి దృష్టి ప‌డింది.

ఇక ఎపిసోడ్ లోకి వెళితే... జాన‌కి చెప్ప‌డంతో రామా వంటల పోటీల్లో పాల్గొంటాడు. అక్క‌డ క‌న్న‌బాబు కార‌ణంగా కొంత మంది చేసిన కుట్ర‌తో వంట‌ల పోటీల్లో పాల్గొనే అవ‌కాశం కోల్పోయే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. ఈ కుట్ర‌లో రామా చెయ్యి కూడా విరుగుతుంది. అయినా స‌రే జాన‌కి స‌పోర్ట్ తో త‌ల్లి జ్ఞానాంబ కోసం పోటీలో పాల్గొంటాడు రామా. చివ‌రికి వంట‌ల పోటీల్లో విజేత‌గా నిలుస్తాడు. ప్రైజ్ మ‌నీనీ సొంతం చేసుకుంటాడు. రామా విజేత‌గా నిల‌వ‌డంతో అత‌నికి ఘ‌న స్వాగ‌తం ఏర్పాటు చేస్తారు.

గ‌ర్వంగా తిరిగి వ‌చ్చిన రామాని వెంట బెట్టుకుని జానికి క‌న్న‌బాబు ద‌గ్గ‌రికి వెళుతుంది. ఆయ‌న అవ‌స‌రాన్ని అవ‌కాశంగా తీసుకుని మోసం చేసి ఆయ‌న‌తో సంత‌కం చేసి సంత‌కాలు చేయ‌చించుకున్నావు` అంటూ వార్నింగ్ ఇస్తుంది. గ‌డువులోపు నీ డ‌బ్బులు నీ ముఖాన కొడ‌తాన‌ని చెప్పాను తీసుకో అంటూ క‌న్న‌బాబు ముఖాన డ‌బ్బుల క‌ట్ట కొడ‌తాడు రామా. ఆ వెంట‌నే జాన‌కి క‌న్న‌బాబు ద‌గ్గ‌ర వున్న డాక్యు మెంట్స్ ని తీసుకుని చించేస్తుంది. దీన్ని క‌న్న‌బాబు అవ‌మానంగా భావిస్తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే సోమ‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.