English | Telugu
డైరెక్టర్స్ వెతక్కండి...హీరోయిన్ మెటీరియల్ శ్రీసత్య!
Updated : Jan 31, 2024
సూపర్ జోడి షోలో ఈ వారం పెర్ఫార్మెన్సెస్ ఇరగదీసారు ఒక్కో జోడి. ఇక ఈ వారం వచ్చిన నాలుగు జోడీల్లో సాంకేత్ - శ్రీ సత్య పెర్ఫార్మెన్స్ మాత్రం కూల్ వెదర్ లో సూపర్ హాట్ గా ఉంది. స్టేజి మీద అందరికీ చెమటలు పట్టించేశారు వీళ్ళ డాన్స్ తో. చివరికి శ్రీసత్య సాంకేత్ కి ముద్దు పెట్టేసరికి షాకైపోయింది జడ్జ్ మీనా. ఇక హోస్ట్ ఉదయ భాను వచ్చి "వింటర్ లో కూడా మిడ్ సమ్మర్ వచ్చేసిందబ్బా ..వ్వాట్ ఏ పెర్ఫార్మెన్స్ " అంటూ ఓ రేంజ్ లో వాళ్ళ డాన్స్ కి పొగిడేసింది.
ఇక జడ్జ్ శ్రీదేవి కూడా "వన్ అండ్ ఓన్లీ హాట్ కపుల్ అని మీరు ప్రూవ్ చేశారు. సాంకేత్ మీ డాన్సింగ్ స్టైల్ చూసి ఏ అమ్మాయి ఐనా పడిపోతారు..మీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది" అని చెప్పింది. ఇక ఉదయభాను శ్రీసత్యని తెగ పొగిడేసింది "మీకు మీరే ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఐతే నేను ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. నాకు శ్రీ సత్యలో ఒక హీరోయిన్ కనిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్ సరిపోయే హీరోయిన్ మెటీరియల్ నాకు కనిపిస్తోంది. సాయి పల్లవి లాంటి డాన్సర్స్ కి కూడా కాంపిటీషన్ ఇచ్చే డాన్సర్ నాకు కనిపిస్తోంది. మీకు కనిపిస్తుందో లేదు కానీ నాకు కనిపిస్తోంది. ఎక్కడెక్కడో వెతక్కండి ఇక్కడో తెలుగు పిల్ల ఉందబ్బా..మీ డాన్స్ కూడా అద్దిరిపోయింది" అని చెప్పింది ఉదయభాను.. తర్వాత ఈ జోడికి బాగా తెలిసిన మరో జోడి యష్ మాష్టర్ ని తన వైఫ్ వర్షని ఇన్వైట్ చేసింది. "నేను కొరియోగ్రాఫర్ గా చేసేటప్పుడు నా గ్రూప్ లో సాంకేత్ పని చేసేవాడు..ఇప్పుడు ఇలా స్టేజి మీద కొరియోగ్రాఫర్ గా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది...వీళ్లిద్దరు ఇక్కడ చేసిన హాట్ పెర్ఫార్మెన్స్ తక్కువ ఆఫ్ స్క్రీన్ లో ఇంకా ఎక్కువగా చేస్తారు. రఘు మాస్టర్ మీరు నెక్స్ట్ టైం నుంచి మార్క్స్ వేయకండి. ఎందుకంటే ఇకముందు సాంకేత్ ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎక్కువగా చేస్తాడు " అంటూ కాసేపు ఫన్ క్రియేట్ చేసి తన వైఫ్ వర్షతో కలిసి డాన్స్ చేసాడు యష్ మాస్టర్.