English | Telugu

ఏం థంబ్ నైల్ రా బాబు అది!

జబర్దస్త్ కమెడియన్స్ లో పంచ్ ప్రసాద్ గురించి తెలిసిందే. ఇతను కొన్నాళ్లుగా కిడ్నీకి సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాల మీదకు రావడంతో తోటి కమెడియన్స్ ఆదుకున్నారు. పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కి ఆర్థిక సహాయం చేశారు. ట్రీట్ మెంట్ కారణంగా చాలా కాలం పంచ్ ప్రసాద్ బుల్లితెరకు దూరమయ్యాడు. డయాలసిస్ చేయించుకుంటున్న ప్రసాద్ ప్రస్తుతం కోలుకుని రీ-ఎంట్రీ ఇచ్చాడు.

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతిరత్నాలు వంటి కామెడీ షోలలో పంచ్ ప్రసాద్ కనిపిస్తున్నాడు. పంచ్ ప్రసాద్ ఆరోగ్యంపై కూడా కమెడియన్స్ అప్పుడప్పుడు జోక్స్ వేస్తుంటారు. ఆయన కూడా తనపై తాను పంచెస్ వేస్తూ ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఇలాంటి టైంలో "పంచ్ ప్రసాద్ రెండో పెళ్లి చేసుకున్నాడు" అన్న వార్త సంచలనం రేపుతోంది. కమెడియన్ ఇమ్మానియేల్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేసేసరికి అందరిలో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. అయితే ఇదంతా కమెడియన్ ఇమ్మానియేల్ ఫాన్స్ ఫోకస్ ని తమ వైపు తిప్పుకోవడానికి చేసిన ఒక ట్రిక్ లా కనిపిస్తోంది.

ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ప్రసాద్ కి ఆయన భార్యతో మళ్ళీ పెళ్లి చేశారు. ఆ ఎపిసోడ్ లో పంచ్ ప్రసాద్ కి సంబంధించిన కొన్ని ఎమోషనల్ వీడియోస్ ప్లే చేశారు. ఇక తమ ఇంట్లో పంచ్ ప్రసాద్ కి తన భార్యకు మధ్య జరిగిన డిస్కషన్ వీడియోలు శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రదర్శించారు. ఇక ఈ మొత్తానికి సంబంధించిన ఒక వీడియోని ప్రసాద్ కి రెండో వివాహం అని థంబ్ నైల్ పెట్టి ఫోటో విడుదల చేశారు. నిజానికి పంచ్ ప్రసాద్ ఎవరినీ మరో పెళ్లి చేసుకోలేదు. ఐతే ఈ వీడియోకి ఏమంత రెస్పాన్స్ రావడం లేదని అనుకున్న ఇమ్ము తన ఫ్రెండ్ కోసం తన ఇన్స్టా స్టేటస్ లో పెట్టేసరికి వ్యూస్ బాగా పెరుగుతున్నాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.