English | Telugu
Brahmamudi: వాళ్ళిద్దరూ కలిసి రాహుల్ బండారం బయటపెడతారా.. జస్ట్ మిస్!
Updated : Nov 2, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -867 లో... రాజ్, కావ్య ముసలి వాళ్ళ గెటప్ లో వచ్చి కోయిలి టెంప్ట్ అయ్యే విధంగా మాట్లాడుతారు. ఇక మేమ్ వెళ్తాము ఆస్తులన్నీ ఎవరికైనా రాసిచ్చేస్తామని కావ్య అనగానే వద్దు బామ్మా గారు మీరు ఇక్కడే ఉండండి అని కోయిలి అంటుంది. నువ్వు మమ్మల్ని ఇక్కడే ఉండమంటున్నావా.. మమ్మల్ని బాగా చూసుకుంటావ్.. అలాగే ఆస్తులు కూడా బాగా చూసుకుంటావని అర్థమవుతుందని కావ్య అంటుంది.
ఆ తర్వాత రాజ్, కావ్యని రాహుల్ బయటకు తీసుకొని వస్తాడు. అసలు మీరెందుకు వచ్చారని రాహుల్ అడుగతాడు. గుర్తు పట్టేశావా అని రాజ్ అంటాడు. నువ్వు మాతో రావాలని రాజ్ అంటాడు. నేను రాను.. మీ గురించి వెళ్లి కోయిలికి చెప్తానని రాహుల్ అనగానే చెప్పు మేమ్ కూడా నీ గురించి చెప్తాము.. ఇంట్లో నీ స్థాయి ఏంటో చెప్తామని రాజ్, కావ్య బ్లాక్ మెయిల్ చెయ్యడంతో రాహుల్ సైలెంట్ గా ఉంటాడు.
అప్పుడే రాజ్, కావ్యలకి కోయిలి కాఫీ తీసుకొని వస్తుంది. అది తాగి ఏం బాలేదని చెప్తారు. తమకి భోజనం ఏర్పాట్లు చేయమని రాజ్, కావ్య ఇద్దరు ఒక పెద్ద లిస్ట్ నే చెప్తారు. అది చూసి కోయిలి, రంజిత్ షాక్ అవుతారు. వాళ్ళు పక్కకు వచ్చి మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏంటి అంత ఆర్డర్ చేశారు.. ఇప్పటికే మనం అప్పుల్లో ఉన్నామని రంజిత్ అంటాడు. ఎన్ని ఖర్చు పెట్టినా అన్నీ వసూలు చెస్తాను కదా అని కోయిలి అంటుంది.
మరొకవైపు రాజ్, కావ్య రూమ్ కి వెళ్లి గెటప్ తీసేస్తారు. అప్పుడే అటుగా వెళ్తు రంజిత్ చూస్తాడు. మళ్ళీ వెనక్కి వచ్చి చూసేసరికి రాజ్, కావ్య ఇద్దరు ఓల్డ్ గెటప్ లో ఉంటారు. ఆ తర్వాత రంజిత్ వెళ్లిపోతాడు. అమ్మో జస్ట్ మిస్.. వాడిని చూసాను కాబట్టి మేనేజ్ చేసాం.. లేదంటే దొరికిపోయేవాళ్ళమని రాజ్ అంటాడు. మరొకవైపు స్వప్న బాధపడుతుంటే.. అప్పు వచ్చి తనతో మాట్లాడుతుంది.
తరువాయి భాగంలో రాజ్, కావ్య యాక్టింగ్ లో భాగంగా రాజ్ తన ఫ్రెండ్ ని రంగంలోకి దించుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.