English | Telugu

గొడవ మొదలుపెట్టింది దివ్య.. తలపొగరు దించుకో తనూజ: నాగార్జున!

బిగ్ బాస్ సీజన్-9 ఫ్యామిలీ వీక్ ముగిసింది. ఇక వీకెండ్ లో వచ్చిన నాగార్జున మొదటగా దివ్య వర్సెస్ తనూజ మధ్య సాగుతున్న గొడవను ఆపడానికి ఇద్దరిని అడిగాడు. ఇక మొదటగా తనుజా, దివ్యల గొడవలో ఎవరిది తప్పు భరణీ అని నాగార్జున అడిగితే.. తనుజదే సర్.. ఎందుకంటే గేమ్ వరకూ వచ్చేటప్పటికి ఎవరి నిర్ణయం వాళ్లది కదా సర్.. ఎవరి పాయింట్స్ వాళ్లకి ఉంటాయి. ఎవరి పాయింట్ వాళ్లు రేజ్ చేసి మాట్లాడతారు.. అది దివ్య పాయింట్ రేజ్ చెయ్యడం వల్లే మిగిలిన వాళ్లంతా అదే పాయింట్ పట్టుకున్నారని తనుజా అనుకుంటుంది కానీ అక్కడ ఎవరి పాయింట్స్ వాళ్లకి ఉన్నాయి సర్ అని భరణి అన్నాడు. అంటే నీ ఉద్దేశం ప్రకారం కెఫ్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ చెయ్యబడితే తనూజ పాయింట్స్ వాళ్లు పెట్టుకోకూడదు అంతేనా భరణి అని నాగార్జున అడుగగా.. అలా ఏం కాదు సర్.. మీరిప్పుడు తప్పు ఎవరిది అన్నారు కాబట్టి నాకు అనిపించిది చెప్పానని భరణి అంటాడు‌.

ఇమ్మానుయేల్ నువ్వు చెప్పు తప్పు ఎవరిదని నాగార్జున అడుగగా.. స్టాండ్ తీసుకోవడం తప్పు అయితే కాదు సర్.. కానీ ఆ గొడవలో దివ్య ఎక్కడో కొన్ని మాటలు వదిలేసింది. నేను దివ్యది తప్పు అనుకుంటున్నాను సర్.. కొంచెం మీద మీదకు వచ్చేసి.. గట్టిగట్టిగా అరిచేసి.. నిజానికి దివ్య ఆ రోజు బ్యాలెన్స్ తప్పిందనే నాకు అనిపించిందని ఇమ్మాన్యుయల్ అన్నాడు. ఆ తర్వాత డీమాన్ పవన్ ని అడుగుతాడు నాగార్జున. పవన్ గొడవ ఆపడానికి దివ్యను లాక్కుని వెళ్లి, నీ ప్రయత్నం నువ్వు చేశావ్.. మరి ఇందులో తప్పు ఎవరిది తనుజదా.. దివ్యదా.. అని అడుగగా.. దివ్య వాయిస్ రేజ్ చేసింది కానీ తనుజా పో పో అనేసరికే దివ్య మాటలు అనేసింది సర్.. నాకైతే తనుజాదే తప్పు అనిపిస్తోంది సర్ డీమాన్ పవన్ అంటాడు. పో అనేది పెద్ద పదమా.. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అనేది పెద్ద పదమా అని నాగార్జున అడుగగా.. పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు అనేది పెద్ద పదం అని డీమాన్ పవన్ అన్నాడు. సరే ఆ గొడవ ఎక్కడ మొదలైందో చూపిస్తానంటూ వీడియో ప్లే చేసి చూపిస్తాడు నాగార్జున. ఆ వీడియోలో దివ్య.. కెఫ్టెన్సీ రేస్ నుంచి తనుజా పేరు తియ్యగానే ప్రతి దానికి నువ్వు నన్ను లాగకు అంటూ తనూజ అంటూ మొదలుపెడుతుంది. ఇద్దరూ వాయిస్ రేజ్ అయ్యేసరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు తనుజా అని మొదట దివ్యే అంటుంది. సీరియల్ స్టార్ నువ్వు.. సీరియల్‌లో ఏడ్చుకున్నట్లే ఇక్కడ కూడా ఏడువు అంటూ దివ్య మాట్లాడిన మాటలే వీడియోలో ఎక్కువగా కనిపిస్తాయి. అది చూసిన వెంటనే డీమాన్ పవన్.. ఇప్పుడైతే దివ్యదే ఎక్కువ తప్పుగా కనిపిస్తోంది సర్.. కానీ ముందు రోజు కూడా ఒకటి అయ్యింది సర్ అందుకే అని అంటాడు. ముందురోజు ఏమైందని నాగార్జున అడిగాడు. భరణి గారు తనుజకి ఆయింట్‌మెంట్ రాస్తున్నప్పుడు కూడా గొడవ అయ్యింది సర్ చిన్నది అని డీమాన్ పవన్ అంటాడు. భరణికి చెయ్యి ఎప్పటి నుంచి బాలేదని నాగార్జున అడుగగా.. సెకండ్ వీక్ నుంచి అని దివ్య. మరి అదే వీక్ నుంచి నువ్వు తల కూడా మసాజ్ చేయించుకున్నావ్ కదా అని నాగార్జున అన్నాడు. అప్పుడు తగ్గిందని అన్నాడు సర్ అని దివ్య అంటుంది.

తనుజా మీ పాయింట్ మీరు చెప్పుకునే క్రమంలో కూల్‌గా కామ్‌గా మాట్లాడటం నేర్చుకో.. లేదంటే పాతాళంలోకి వెళ్లిపోతావ్.. దివ్య చాలా మాటలు అంది కానీ నువ్వు అన్న పో అనే మాటే గుర్తుంది ఈ ఇంట్లో అందరికి. ఆడియన్స్‌కి కూడా అదే గుర్తుంటుంది. కెప్టెన్ అయ్యాక తలపొగరు ఎక్కిందా.. తనుజా నువ్వు కరెక్ట్ చేసుకోకపోతే నువ్వే నష్టపోతావ్ కూర్చోమ్మా అని నాగార్జున అన్నాడు. భరణి గారు తనుజాకి సేవలు చేస్తే నాకే ప్రాబ్లమ్ లేదు సర్ దివ్య చెప్తుంటే.. ప్రాబ్లమ్ ఉంది దివ్యా.. ఇప్పుడు మార్చకని నాగార్జున అనేసరికి దివ్య సైలైంట్ అవుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అన్నందుకు అది నా తప్పే, తప్పుగానే మాట్లాడాను అలా మాట్లాడి ఉండకూడదు.. తప్పు నాది ఉందని దివ్య తప్పుని అంగీకరించినట్లే మాట్లాడుతుంది. తప్పు నీది ఉంది కాదమ్మా.. తప్పు నీతో మొదలైందని నాగార్జున అనడంతో.. ఎస్ సర్.. ఒప్పుకుంటున్నాను.. మాట జారాను సర్ అని దివ్య అంటుంది. మాట జారితే ఆట జారిపోతుంది జాగ్రత్త కూర్చోమని నాగార్జున అన్నాడు.