English | Telugu
Brahmamudi : రాహుల్ ప్లాన్ సక్సెస్.. కావ్య మరో ఛాన్స్ ఇస్తుందా!
Updated : Nov 18, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -880 లో.....రాహుల్ తీసుకొని వచ్చిన చీర కట్టుకొని స్వప్న వస్తుంటే నాసిరకం చీర కట్టుకున్నావేంటని ధాన్యాలక్ష్మి అడుగుతుంది. ఇది రాహుల్ ప్రేమతో తీసుకొని వచ్చాడని స్వప్న చెప్తుంది. బాలేదని ధాన్యలక్ష్మి చెప్తుంది. నాకూ నచ్చిందని స్వప్న చెప్తుంది. అప్పుడే రాహుల్ వస్తాడు. రేయ్ రాహుల్ ఈ ఇరవై లక్షల చెక్ తీసుకొని డబ్బు డ్రా చేసి టెండర్ ఆఫీస్ కి వెళ్ళు అని రాజ్ చెప్తాడు. ఇంట్లో అందరు రాహుల్ ని నమ్మి అంత డబ్బు ఇవ్వడం దేనికి అని అంటారు. రాహుల్ కి ఒక్క ఛాన్స్ ఇద్దామని కళావతి చెప్పిందని రాజ్ అంటాడు.
ఆ తర్వాత నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద బాధ్యత ఇస్తున్నావ్ థాంక్స్ అని రాహుల్ అంటాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి స్వప్న వచ్చి థాంక్స్ కావ్య నేను రాహుల్ కి ఒక్క ఛాన్స్ ఇప్పించాలనుకున్న కానీ మీరు రాహుల్ ని నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చారని స్వప్న అంటుంది. మనలో మనకి ఎందుకు అక్క ఇవన్నీ అని కావ్య అంటుంది. ఆ తర్వాత రాహుల్ డబ్బు డ్రా చేసుకొని వెళ్తుంటే కొందరు రౌడీలు రాహుల్ వెంటపడి డబ్బు తీసుకుంటారు. మరొకవైపు రాహుల్ ఇంకా టెండర్ ఆఫీస్ కి రాలేదని రాజ్ కి ప్రకాష్ ఫోన్ చేసి చెప్తాడు. ఇంకేముంది అంత డబ్బు చూసి తీసుకొని పారిపోయాడని ధాన్యలక్ష్మి అంటుంది.
ఆ తర్వాత రాహుల్ దెబ్బలతో డబ్బు పట్టుకొని ఎంట్రీ ఇస్తాడు. సారీ రాజ్ నేను డబ్బు టైమ్ కి టెండర్ ఆఫీస్ కి తీసుకొని వెళ్ళలేకపోయానని అంటాడు. రౌడీలు డబ్బు పట్టుకొని పారిపోతుంటే వాళ్ళని పట్టుకొని డబ్బు తీసుకొని వచ్చానని రాహుల్ చెప్తాడు. అంతా అబద్ధం అని ధాన్యలక్ష్మి అంటుంది. అది నిజమే అంటూ సుభాష్ ఎంట్రీ ఇస్తాడు. రౌడీలు డబ్బు తీసుకొని వెళ్తుంటే రాహుల్ వాళ్ళ దగ్గర నుండి డబ్బు తీసుకున్నాడు. అదంతా నేను చూసానని సుభాష్ చెప్తాడు. తరువాయి భాగంలో ఆ రౌడీలు మన వాళ్లే ఇదంతా ప్లాన్ అని రుద్రాణికి రాహుల్ చెప్తాడు. రాహుల్ కి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని రాజ్ కి కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.