English | Telugu

Karthika Deepam2 : కాశీకి జాబ్ లేదనే నిజం తెలుసుకున్న స్వప్న.. శివన్నారాయణ ఇంట్లో హోమం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -517 లో.... కాశీ ఆఫీస్ కి హడావిడిగా రెడీ అవుతాడు. కాశీ వెళ్తుంటే.. నీతో పాటు నేను కూడా వస్తాను.. నాకు మీ ఆఫీస్ పక్కన చిన్న పని ఉందని స్వప్న అంటుంది. వద్దని కాశీ అంటాడు. నాకు చాలా స్ట్రెస్ ఉంది.. వెళ్ళాలని లేదని కాశీ అంటాడు. జాబ్ చేసే వాళ్ళకి కదా స్ట్రెస్ నీకు ఎందుకని స్వప్న అనగానే కాశీ షాక్ అవుతాడు. నాకు తెలుసు నువ్వు జాబ్ చెయ్యట్లేదు.. ఇప్పుడు నిజం చెప్పమని తన తలపై చెయ్ పెట్టుకొని స్వప్న అడుగుతుంది.

దాంతో కాశీ తనకి జాబ్ లేదన్న నిజం చెప్తాడు. స్వప్న ఏడుస్తూ నన్ను మోసం చేసావంటూ లోపలికి వెళ్తుంది. మరొకవైపు శివన్నారాయణ పంతులిని పిలిపించి ఇంట్లో వాళ్ళ జాతకాలు చూపిస్తాడు. అవి చూసి మీ అందరికి దోషాలు ఉన్నాయి. ఒక మంచి విషయం ఏంటంటే.. ఈ ఇంటి వారసురాలకి మంచి జరగబోతుందని పంతులు చెప్తాడు. మీకున్న దోషం పోవాలంటే హోమం చెయ్యాలి. రేపు చేద్దాం.. అన్ని ఏర్పాట్లు చేసుకోండి ఈ కుటుంబంతో సంబంధం ఉన్న అందరూ ఈ హోమానికి రావాలని పంతులు చెప్తాడు. మరోవైపు స్వప్న ఏడుస్తుంటే.. కాశీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ తను వినిపించుకోదు. అప్పుడే కావేరి వస్తుంది. తనకి కూడా జరిగింది చెప్తుంది. దాంతో అల్లుడు నన్ను మోసం చేసాడని ఎమోషనల్ అవుతుంది.

ఆ తర్వాత శివన్నారాయణ చెప్పిన కొద్దీ కార్తీక్ హోమానికి పిలవాల్సిన వాళ్ళ లిస్ట్ రాస్తాడు. అప్పుడే శ్రీధర్ వస్తాడు. శ్రీధర్ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా రాయి అని శ్రీధర్, కావేరి, స్వప్న, కాశీ, దాస్ పేర్లు చెప్తాడు. దాంతో ఆ కావేరి, స్వప్న ఎందుకు అని పారిజాతం, జ్యోత్స్న అడ్డుచెప్తారు. వాళ్ళు వస్తే ఈ కుటుంబం పరువు ఏం కావాలని పారిజాతం వద్దని చెప్తుంది. మేము రాము లెండి మావయ్య అని శ్రీధర్ బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. జ్యోత్స్న, పారిజాతం లోపలికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...