English | Telugu
Brahmamudi : పాలగ్లాస్ తో గదిలో కావ్య.. స్వప్నకి విడాకులు ఇస్తానన్న రాహుల్!
Updated : Oct 29, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -863 లో..... కావ్య వ్యాయామం చేస్తూ ఉంటే రాజ్ వస్తాడు. ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా.. ఎగ్జిట్ గోల్స్ అంటూ నీకు నచ్చింది చేస్తున్నావని రాజ్ కోప్పడతాడు. అప్పుడే ఇందిరాదేవి వచ్చి వీడు ఏమంటున్నాడని కావ్యని ఇందిరాదేవి అడుగుతుంది. మీకేం అర్థం కాలేదు కదా అని కావ్య అనగానే.. కాలేదని ఇందిరాదేవి చెప్తుంది. దాంతో కావ్య రిలాక్స్ అవుతుంది.
మరొకవైపు అప్పు అద్దం దగ్గర ఉంటుంది. వెనకాల నుండి కళ్యాణ్ వచ్చి హగ్ చేసుకుంటాడు. ఏంటి ఈ రోజు ఇలా చేస్తున్నావని అప్పు అడుగుతుంది. అప్పుడే అప్పుని ధాన్యలక్ష్మి పిలవడంతో అప్పు వెళ్ళిపోతుంది. మమ్మీ కరెక్ట్ టైమ్ కి పిలుస్తుందని కళ్యాణ్ అనుకుంటాడు. ఆ తర్వాత స్వప్న, కావ్య హాస్పిటల్ కి వెళ్తారు. అక్కడ పక్కనే రాహుల్ ఇంకా తన లవర్ ఐస్ క్రీమ్ తింటూ కన్పిస్తారు. అది చూసిన కావ్య ఇంకా రాహుల్ మారలేదా అని స్వప్నని అడుగుతుంది. ఇప్పుడే వెళ్లి నాలుగు కొట్టి నిలదియ్ అని కావ్య అనగానే.. ఇంటికి వచ్చాక వాడి సంగతి చెప్తానని స్వప్న అంటుంది. ఆ తర్వాత రాహుల్ తో షాపింగ్ చేసి బిల్ కట్టించాలని తన లవర్ అనుకుటుంది. ఇప్పుడు దీంతో షాపింగ్ కి వెళ్తే బిల్ నన్నే కట్టమంటుందని రాహుల్ ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు.
ఆ తర్వాత కావ్య మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాస్ తో గదిలోకి వెళ్తుంటే.. ఇదేంటి కొత్తగా అని ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు కావ్యని అడుగుతారు. మీ మనవడు అలా రమ్మన్నాడని కావ్య చెప్తుంది. నువ్వు ప్రెగ్నెంట్ వి జాగ్రత్తగా ఉండాలని కావ్యతో అపర్ణ, ఇందిరాదేవి అంటారు. ఆ విషయం మీ మనవడికి చెప్పండి అని కావ్య చెప్పి వెళ్లిపోతుంది. రాజ్ రాగానే నువ్వు చేస్తుంది ఏంట్రా తను ప్రెగ్నెంట్.. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అని ఇందిరాదేవి అనగానే ఆ విషయం మీ మనవరాలికి చెప్పండి అని రాజ్ లోపలికి వెళ్తాడు. లోపల కావ్య పాల గ్లాస్ తో సిగ్గుపడుతుంటే ఏంటే ఈ అవతారమని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో స్వప్నకి రాహుల్ విడాకులు ఇస్తానని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.