English | Telugu
కన్నీళ్లు పెట్టుకున్న భావన.. భాను డాన్స్ లో డెప్త్ కాదు విడ్త్ కూడా ఉంది
Updated : Oct 28, 2025
కార్తీక మాసం స్పెషల్ గా "కార్తీక వైభోగమే" పేరుతో ఈ ఆదివారం స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ కార్తీక పౌర్ణమిని స్పెషల్ గా చేసుకోబోతున్నాం అలాగే అక్కాచెల్లెళ్ల సెలబ్రేషన్ కూడా చేసుకోబోతున్నాం. ఈ షోకి శ్రీవాణి తన అక్కని తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసింది. ఇక ఢీ డాన్సర్ మహేశ్వరీ ఐతే ఆ నటరాజుడు కలిపినా అక్కచెల్లెళ్ళం మేము అని చెప్పింది. ఇక అందరూ శివలింగానికి క్షీరాభిషేకం చేసి ఆ నందీశ్వరుడి చెవిలో ఎం చెప్తే ఆ కోరిక నెరవేరుతుందని అందరూ వారి వారి కోరికలు కోరుకున్నారు. ఇక భావన ఐతే కన్నీళ్లు పెట్టుకుంది. "ఎందుకు అని రష్మీ అడిగింది" ." నాకు ఒక సొంత అక్క ఉంది.
కానీ చాల రోజుల నుంచి మాటలు లేవు. ఇంతమంది అక్కాచెల్లెళ్లను చూసేసరికి బాధ కలిగింది. అక్కను దగ్గర చేసుకుంటే అమ్మ దూరమైపోతుంది. అమ్మను దగ్గర చేసుకుంటే అక్క దూరమైపోతుంది. ఎవరు కావాలి అని డిసైడ్ చేసుకోవాలో తెలీట్లేదు" అని ఏడ్చేసింది. ఇక అల్లరి ప్రియుడు మూవీ సీన్ ని స్పూఫ్ గా చేశారు మహేశ్వరి, సత్యశ్రీ, నాటీ నరేష్. "చెప్పవే చిరుగాలి" సాంగ్ కి భానుశ్రీ డాన్స్ చేసింది. వెంటనే రష్మీ "మేడం భాను పెర్ఫార్మెన్స్ లో డెప్త్ ఉందా" అని అడిగింది. "డెప్త్ కాదు విడ్త్ కూడా ఉంది" అంటూ ఇంద్రజ ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. ఇక డాన్సర్స్ అంతా కలిసి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర మహిమను వర్ణిస్తూ చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.