English | Telugu

Karthika Deepam2 : కార్తీక్ ని నాన్న అంటూ పిలిచిన శౌర్య.. ఎమోషనల్ ఎపిసోడ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -183 లో.... దీపని తీసుకొని కార్తిక్ ఇంటికి రాగానే అమ్మ ఎక్కడికి వెళ్ళావ్.. నాపై కోపం వచ్చిందా.. నువ్వు కావాలి అమ్మ అని శౌర్య ఏడుస్తుంది. నువ్వు కావాలి.. కార్తీక్ కావాలని శౌర్య అంటుంది. ఆ తర్వాత శౌర్యని కార్తీక్ లోపలికి పంపించి దీప వాళ్ళింటికి వెళ్ళింది. సొంత కూతురిని క్షేమించలేని వాళ్ళు తననెలా క్షమిస్తారు అమ్మ అని కార్తీక్ అంటాడు.

అక్కడేం జరిగిందని కాంచన అడుగుతుంది. చేసిన పని ఈవిడ దృష్టిలో పాపం అందుకే క్షమించమని అడగడానికి వెళ్ళింది. మనల్ని మర్యాదగా వెళ్లామన్నారు.. తనని మర్యాదగా గెంటేసారు.. నేను టైమ్ కి వెళ్లకపోతే కిందపడేదని కార్తీక్ అంటాడు. ఇదంతా నేనే చేసాను.. స్వార్థంతో నేను నిన్ను పెళ్లి చేసుకున్నా అంతే గానీ నీ ఇష్టం ఏం లేదని కార్తీక్ అంటాడు. నేను వెళ్ళిపోతానని దీప అనగానే.. నువ్వు వెళ్లకుండా వీళ్ళతో నేను కూడా నీ అత్తగా అడ్డు ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్లనవసరం లేదు.. ఇక్కడే మనం అంత ఉందాం.. మనం అంత ఇక ఒక ఫ్యామిలీ అని కాంచన అంటుంది. చైర్ మమ్మీ చెప్పింది అంటే ఆల్వేస్ రైట్ అని శౌర్య అనగానే చైర్ మమ్మీ కాదే నానమ్మ అను అని కాంచన అనగానే.. నానమ్మ అంటు శౌర్య పిలుస్తుంది. దీప జరిగింది గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత కావేరితో ఫోన్ మాట్లాడుతుంది స్వప్న. ఆ దీపకి దూరంగా ఉండమని చెప్పగానే.. నేను అలా చేయను.. మేమే వాళ్ళింటికి వెళ్లి కంగ్రాట్స్ చెప్పి వస్తామని స్వప్న అనగానే.. కావేరి కోప్పడి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడే దాస్, కాశీలు వస్తారు. మనం వాళ్ళ దగ్గరికి వెళదామని స్వప్న అనగానే.. ఫోన్ చేసి వెళ్లడం బెటర్ అని దాస్ అంటాడు. ఇప్పటికే లేట్ అయిందని స్వప్న అంటుంది.

ఆ తర్వాత దీప, కార్తీక్ లని ఒక్కటి చెయ్యాలని అనసూయ, కాంచన అనుకుంటారు. అనసూయ చెయ్ కాలిందంటూ గట్టిగా అరవడంతో.. దీప వచ్చి మీరెందుకు చేస్తున్నారని అడుగుతుంది. మరి నువ్వు ఏం చెయ్యలేదని అనసూయ అంటుంది. సరే నేను చేస్తానని దీప అంటుంది. ముందుగా పాలు పొంగించి.. నాకు కాఫీ తీసుకొని రా అని కాంచన చెప్తుంది. ఆ తర్వాత ఇదంతా వీళ్ళు ఎందుకు చేస్తున్నారని దీప అనుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్ వర్క్ చేసుకుంటుంటే శౌర్య చాటు నుండి చూస్తూ.. నాన్న అంటుంది. దాంతో కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.