English | Telugu

Brahmamudi : నీకు మంత్లీ పేమెంటా? వీక్లీ పేమెంటా?

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -519 లో..... కావ్యని రాజ్ రమ్మని చెప్తే రానని కచ్చితంగా చెప్తుంది. ఇంకొకసారి నీ ఇంటిలో అడుగుపెట్టనని రాజ్ కోపంగా చెప్తాడు. నేను కూడా మీ ఇంట్లో అడుగుపెట్టనని కావ్య కూడా చెప్తుంది. ఆ తర్వాత రాజ్ వెళ్తాడు. ఏంటి నువ్వేం చేస్తున్నావని కావ్యని కనకం అడుగుతుంది. తను ప్రేమ గా మాట్లాడితే నేను అలాగే మాట్లాడేదాన్ని అని కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్ అపర్ణ అన్న మాటలు గుర్తు చేసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి కావ్య దగ్గరికి వెళ్తాడు.

ఇంకా మీరు అనాల్సిన మాటలు ఉన్నాయా అని కావ్య అనగానే ఇంకా నువ్వు పెల్చాల్సిన తూటాలు ఏమైనా ఉన్నాయా అని రాజ్ అంటాడు. నీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను. ఏ భర్త తన భార్యకి ఇవ్వని ఆఫర్ నేను నీకు ఇస్తున్నాను.. నువ్వు మా ఇంట్లో కోడలిగా నటించడానికి ఎంత తీసుకుంటావనగానే కావ్య షాక్ అవుతుంది. చెక్ తీసుకొని వచ్చాను. ఎంత కావాలి మంత్లీ పేమెంటా? వీక్లీ పేమెంటా అని రాజ్ అంటాడు. ఎంతైనా ఇస్తారా.. ఆగండి ఒక నిమిషం అంటూ కావ్య లోపలికి వెళ్లి కొన్ని నగలు తీసుకొని వస్తుంది. మీకు నెల జీతం ఎంత అని అడుగుతుంది. నా ఆఫీస్ లో నాకు జీతమేంటి? నేనే ఖర్చులకి అయిదు లక్షలు తీసుకుంటానని రాజ్ అంటాడు. అయితే ఈ నగలు అమ్మితే అయిదు లక్షలు వస్తాయ్.. అవి తీసుకొని నాకు భర్తగా ఇక్కడికి వచ్చి మీరు నటించాలి.. ఇక్కడ పనులన్ని చెయ్యాలని కావ్య అనగానే.. రాజ్ షాక్ అవుతాడు. నువ్వు నేను ఒకటేనా అంటూ రాజ్ పొగరు చూపిస్తాడు. ఒకటే అంటూ కావ్య తగ్గదు. ఇంకోసారి నీ దగ్గరికి రానంటూ రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత రాజ్ ఇంటికి వెళ్ళగానే అందరు కావ్య ఎక్కడ అని అడుగుతారు. రానని చెప్పిందని రాజ్ అనగానే.. నువ్వు ఎంత బాధపెడితే అలా అంటుందని అపర్ణ అంటుంది. ఇక నన్ను తన కోసం వెళ్ళమని చెప్పకండి అని రాజ్ అంటాడు. నా కోడలు ఎప్పుడు వస్తుంది. నా కొడుకు కాపురం ఎప్పుడు బాగుంటుంది.. ఎలాగైనా కావ్యని ఇంటికి తీసుకొని రావాలని అపర్ణ అంటుంది. మరొకవైపు కళ్యాణ్, అప్పుల దగ్గరికి ఓనర్ వచ్చి.. రెండు రోజుల్లో రెంట్ ఇవ్వాలని చెప్తాడు. ఆ తర్వాత రాజ్ తన అంతరాత్మతో మాట్లాడతాడు. తరువాయి భాగంలో రాజ్ ని కావ్య నిద్ర లేపి కాఫీ ఇస్తుంది. నువ్వు వచ్చావా అని రాజ్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.