English | Telugu

శుభశ్రీ, రోల్ రైడా కలిసి అవినాష్ ని ఎంత  స్టైల్ గా దోచుకున్నారో



ఈ మధ్య కాలంలో అన్నీ ఫ్యాషనైపోయాయి. దొంగతనం కూడా మన కళ్ళముందే జరిగిపోతున్నా మనం ఏమీ చేయలేకపోతున్నాం. అలాగే అమ్మాయిలు ఎదురుగా వచ్చేసరికి అబ్బాయిలు సైలెంట్ ఐపోవడం సినిమాల్లోనే కాదు బయట కూడా జరుగుతోంది. ఇక వాళ్ళు నిలువు దోపిడీ చేసుకుని వెళ్ళిపోయినా అబ్బాయిలు ఎం మాట్లాడరు... తర్వాత ఎప్పటికో నిద్రలేచి చూసుకుంటే అన్నీ స్వాహా. ఇదే కాన్సెప్ట్ ని రోల్ రైడా కొంచెం పోష్ గా చూపించాడు. రోల్ రైడ అంటే మాటల్నే పాటలుగా మార్చి పాడే వ్యక్తి అని తెలుసు. ఇప్పుడు కూడా అలాంటి ఒక కవర్ సాంగ్ ని రాసాడు.

దానికి శుభశ్రీ రాయగురు, అవినాష్ తో కలిసి ఒక వీడియో చేసాడు. రోల్ రైడా పాడుతుంటే వీళ్ళు డాన్స్ చేస్తూ కనిపించారు. ఐతే శుభశ్రీ తన అందంతో రోల్ రైడా తన పాటతో ఇద్దరూ కలిసి అవినాష్ ని దోచుకుంటారు. అవినాష్ కూడా వాళ్ళ మాయలో పడి ముందుగా గోల్డ్ చైన్ ని, తర్వాత కాస్టలీ వాచ్ ని, ఆ తర్వాత బ్రాండెడ్ కళ్లజోడుని కూడా శుభశ్రీకి ఇచ్చేస్తాడు. తర్వాత తన టీ షర్ట్ కూడా తీసి ఇచ్చేయబోతుంటే శుభశ్రీ అది దాచుకో అని కాస్ట్లీ ఐటమ్స్ ని తీసుకుని రోల్ రైడాతో కలిసి ఎంచక్కా చెక్కేస్తుంది. ఇది ఈ సాంగ్ వెనక అసలు థీమ్. ఈరోజున అమ్మాయిలు ఒకళ్ళను ప్రేమించి వాళ్ళను దోచుకుని మరొకరితో చెక్కేస్తున్నారన్న కాన్సెప్ట్ కూడా ఇందులో కనిపిస్తోంది. ఏదేమైనా సొసైటీలో జరిగే ఇష్యూతో వీళ్ళు ఒక వీడియో చేశారు. ఐతే నెటిజన్స్ మాత్రం తమకు ఈ సాంగ్ బాలేదని చెప్పేసారు. ఈ ముగ్గురూ కలిసి ఈ వీడియోని వాళ్ళ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో పోస్ట్ చేసుకున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.