English | Telugu
Brahmamudi : కోరుకున్నవాడితో లేచిపోమని అక్క సలహా...
Updated : Aug 3, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -478 లో... రుద్రాణి చెప్పింది విని కళ్యాణ్ దగ్గరికి వస్తుంది ధాన్యలక్ష్మి. నువ్వు ఇలా ఉంటే ఎలా? అమ్మమ్మ వాళ్ళింటికి కొన్ని రోజులు వెళ్ళు అని ధాన్యలక్ష్మి చెప్తుంది. నువ్వు ఎప్పుడైనా నా గురించి ఆలోచించావా? ఆ అనామిక మాటలు పట్టుకొని నువ్వు నన్ను బాధపెట్టావని కళ్యాణ్ అనగానే.. ఇప్పుడు తప్పు తెలుసుకొని నీ గురించి చెప్తున్నాను.. బెంగళూరు వెళ్ళమని ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వు ఎందుకు వెళ్ళమంటున్నావో తెలుసు.. నువ్వు అనుకున్నది జరగదు.. నేను పెళ్లికి రాను అంటూ కళ్యాణ్ కోపంగా వెళ్లిపోతాడు.. ఇది కూడ బెటరే అని అదంతా వింటున్న రుద్రాణి అనుకుంటుంది.
మరొక వైపు పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. కూతురు పెళ్లికి కనకం హడావిడి అంత ఇంత కాదు.. అది తెచ్చావా ఇది తెచ్చావా అంటు కృష్ణమూర్తిని అడుగుతుంది. అప్పుడే కావ్య వస్తుంది. ఆ తర్వాత అప్పుని స్వప్న రెడీ చేస్తుంటే.. కనకం వచ్చి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావ్.. అయినా పెళ్లిజడ వెయ్యలేదని కనకం అడుగుతుంది. నాకు ఇష్టం లేదు.. అయినా వాళ్ళు పెళ్లి చూపులప్పుడు అలా ఉన్నా ఒకే అన్నారు కదా అని అప్పు అంటుంది. అప్పుడు మనం ఉన్నాం.. ఇప్పుడు చాలా మంది వచ్చారని కనకం అంటుంది. అయిన అప్పు వినదు. మరొకవైపు దుగ్గిరాల ఇంట్లో వాళ్లందరూ పెళ్లికి రెడీ అవుతారు. రుద్రాణి మాత్రం ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్లి.. వచ్చేటప్పుడు కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలని అంటుంది. కావ్య పెళ్లి ఎలా జరిగిందో మర్చిపోయావా అని అంటుంది. ఇప్పుడు కళ్యాణ్ పెళ్లి కి రావడం లేదని ధాన్యలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత అక్కడ ఎవరిని ఏం అనొద్దంటూ రుద్రాణికి ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది. అందరు వెళ్ళిపోతారు.. కళ్యాణ్ దగ్గరికి రాజ్ వచ్చి.. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావ్.. ఇక నీ ఇష్టమని చెప్తాడు. మరొక వైపు దుగ్గిరాల కుటుంబం పెళ్లి దగ్గరికి రాగానే అందరు ఎదురుగా వెళ్లి ఆహ్వానిస్తారు.
ఆ తర్వాత కనకం కుటుంబాన్ని రుద్రాణి తక్కువ చేసి మాట్లాడుతుంటే.. స్వప్న గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. ఆ తర్వాత కావ్య కూడా రుద్రాణికి మాటలతో మర్యాదగా సమాధానం చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ ఫొటోస్ అప్పు డిలీట్ చేస్తుంటే.. స్వప్న వచ్చి నువ్వు ఇంకా కళ్యాణ్ ప్రేమిస్తున్నావా? ఇక్కడ వరకు ఎందుకు తెచ్చుకున్నావ్? ఎవరి గురించి ఆలోచించకు.. దైర్యం చేసి నాలాగా లేచిపో లేదంటే.. పెళ్లి ఆపమని స్వప్న చెప్తుంది. తరువాయి భాగంలో రెండు కుటుంబాల గురించి అలోచించి అప్పుని దూరం చేసుకుంటున్నాను వెంటనే పెళ్లి ఆపాలని కళ్యాణ్ అనుకుంటాడు. ఆ తర్వాత పెళ్లి ఆపుతానని రాజ్.. నేను మిమ్మల్ని ఆపుతానంటూ కావ్య ఛాలెంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.