English | Telugu
Brahmamudi : భార్యతో పాటు మరిది కూడా స్టేషన్ లో.. ఆమె ఏం చేసిందంటే!
Updated : Jul 17, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -463 లో... అబ్బాయిల్ని ఇంత డేంజర్ గా కొడతావా అని అప్పుపై ఇన్ స్పెక్టర్ కోప్పడతాడు. సర్ నన్ను అవమానించారు.. అందుకే కొట్టానని అప్పు అంటుంది. మాకు ఫోన్ చేస్తే మేమ్ వచ్చే వాళ్ళం కదా అని ఇన్‌స్పెక్టర్ అంటాడు. ఆ తర్వాత అప్పు దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. వీళ్లే అన్న అప్పుని ఏడిపించిందని బంటు చెప్పగానే.. కళ్యాణ్ వాళ్ళని స్టేషన్ లోనే కొడతాడు. కానిస్టేబుల్ అడ్డు రావడంతో కళ్యాణ్ కానిస్టేబుల్ ని కొడతాడు. ఇన్‌స్పెక్టర్ కి కోపం వచ్చి కళ్యాణ్ ని కూడా అరెస్ట్ చెయ్యమని చెప్పడంతో.. కళ్యాణ్ ని కూడా అరెస్ట్ చేస్తారు.
మీ వాళ్ళ నెంబర్ చెప్పమని కళ్యాణ్ ని ఇన్‌స్పెక్టర్ అడుగగా.. అతను రాజ్ నెంబర్ చెప్తాడు. మరొకవైపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని కావ్యతో రాజ్ అనగానే.. ఈ కేరింగ్ మొదటి నుండి ఏమైందని కావ్య అంటుంది. అప్పుడే రాజ్ కి ఇన్‌స్పెక్టర్ కాల్ చేసి.. మీ అబ్బాయిని భయంలో పెట్టుకోరా అని ఇన్ స్పెక్టర్ తిడుతుంటే.. మా అబ్బాయా? నాకు అబ్బాయి లేడని రాజ్ అంటాడు. ఇక పక్కనే ఉన్న కావ్య.. అబ్బాయి ఏంటి ? మీకు మళ్ళీ బాబు ఉన్నాడా అని కావ్య అంటుంది. నువ్వు ఆపు అంటూ కావ్యపై రాజ్ కోప్పడతాడు. ఇన్స్పెక్టర్ గారు మీరేం అంటున్నారు నాకు అర్థం కావడం లేదని రాజ్ అనగానే.. కళ్యాణ్ ఇక్కడ కానిస్టేబుల్ ని కొట్టాడని చెప్తాడు. దాంతో కళ్యాణ్ స్టేషన్ లో ఉండడం ఏంటని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ వెళ్తుంటే.. నేను వస్తానని కావ్య అనగానే.. నా ఇన్ ఫ్లూయెన్స్ తో వాడిని బయటకు తీసుకొని వస్తానని రాజ్ కంగారుగా వెళ్తాడు. ప్రకాష్ చూసి ఏమైంది రాజ్ అలా వెళ్తున్నాడని కావ్యని అడుగుతాడు. కావ్య ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ చేస్తుంది.
ఆ తర్వాత రాజ్ స్టేషన్ కి వెళ్ళాక కోపం తో.. ఇన్‌స్పెక్టర్ పై చెయ్యి చేసుకుంటాడు. డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్ పై ఇలా చేస్తావా అని రాజ్ ని కూడా అరెస్ట్ చేస్తాడు ఇన్ స్పెక్టర్. అక్కడే ఉన్న బంటు కావ్యకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. దాంతో కావ్య స్టేషన్ కి వచ్చి.. అప్పు ఏం తప్పు చెయ్యదు. ఈ అబ్బాయిలు తప్పుగా మాట్లాడితే ఇలా చేసిందట అని కావాలంటే రికార్డు కూడా ఉందని కావ్య అనగానే.. రికార్డు ఎక్కడిదని బంటు అనుకుంటాడు. ఇక బంటు కూడ ఉందనగానే.. ఆ అబ్బాయిలు భయపడి.. మాదే తప్పని అంటారు. తరువాయి భాగంలో రాజ్ ని గోరింటాకు పెట్టమని కావ్య అడుగుతుంది. ఇప్పుడు ఎందుకని రాజ్ అనగానే.. ఆషాడంలో ఆడవాళ్లు పెట్టుకుంటారని కావ్య అంటుంది. అలా అనగానే కావ్యకి రాజ్ గోరింటాకు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.