English | Telugu
Brahmamudi : కావ్యని అబార్షన్ చేయించుకోమన్న దుగ్గిరాల కుటుంబం.. తను ఒప్పుకుంటుందా!
Updated : Oct 24, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -859 లో......కావ్యకి అప్పు నిజం చెప్తుంది. అన్నయ్య నిన్ను కాపాడడం కోసమే ఇదంతా చేసాడని కళ్యాణ్ చెప్పగానే అందరు ఇన్ని రోజులు రాజ్ ని తప్పుగా అర్థం చేసుకున్నామని పశ్చతాపపడుతారు. కావ్య ఏడుస్తూ బయటకు వెళ్తుంది. రాజ్ తన వెనకాలే వెళ్తాడు.
మీలో మీరే ఎంత బాధపడ్డారు అండి అని కావ్య ఎమోషనల్ అవుతుంది. చాలా ప్రయత్నం చేసాను.. నా వాళ్ళ కాలేదని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఇన్ని రోజులు రాజ్ ఇలా చేస్తుంటే పిచ్చి పట్టింది అనుకున్నాం కానీ దీని వెనకాల ఇంత ఉందా.. ఇన్ని రోజులు బిడ్డ ఉండద్దని ట్రై చేసాం కానీ ఇప్పటినుండి బిడ్డ ఉండాలి కావ్య ఉండొద్దని ట్రై చెయ్యాలని రాహుల్ తో రుద్రాణి చెప్తుంది. ఇన్ని రోజులు మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకున్నామని రాజ్ తో కనకం అంటుంది. ఆ తర్వాత కావ్య తన బ్యాగ్ తీసుకొని రాజ్ తో పాటు ఇంటికి వెళ్తుంది.
మరుసటి రోజు కావ్య ఇంట్లో అందరికి కాఫీ తీసుకొని వస్తుంది. చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది.
తరువాయి భాగంలో ఇంట్లో అందరు కావ్యని అబార్షన్ చేయించుకొమ్మని సలహా ఇస్తారు నేను చేయించుకొనని కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.