English | Telugu
Illu illalu pillalu : మందు తాగేసిన ప్రేమ.. భయంతో దాక్కున్న శ్రీవల్లి!
Updated : Oct 24, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -297 లో......రామరాజు డ్రింక్ చేస్తూ తన బాధని తిరుపతికి చెప్తూ ఎమోషనల్ అవుతాడు. కంటికి రెప్పలా పెంచుకున్న నా కొడుకుని ఆ ప్రసాదరావు ఇల్లరికం పంపించమని అడుగుతాడా. ఎంత దైర్యం అని చెప్తూ రామరాజు బాధపడుతాడు. దాంతో తిరుపతి అక్కడ నుండి వెళ్తాడు. అదంతా శ్రీవల్లి చూసి హమ్మయ్య ఉన్న ఒక్క మందు బాటిల్ తాగేసాడు. ఇక ప్రేమ తాగే ఛాన్స్ లేదని శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఆ తర్వాత తిరుపతి మందుని కూల్ డ్రింక్ లో కలుపుతాడు. అప్పుడే వేదవతి వచ్చి ఏంట్రా కూల్ డ్రింక్ నువ్వు ఒక్కడివే తాగుతావా అని బాటిల్ లాక్కొని తాగబోతుంటే నర్మద వస్తుంది. ఆ తర్వాత ప్రేమ, శ్రీవల్లి వస్తారు. నలుగురు బాటిల్ కోసం గొడవ పెట్టుకుంటారు. ట్రూత్ ఆర్ డేర్ ఆడుదాం ఎవరు గెలిస్తే వాళ్ళకి అనుకుంటారు. ఫస్ట్ వేదవతికి రాగ మీరు ఈ రోజు మావయ్య కి ఎన్ని సార్లు ముద్దు పెట్టారని వేదవతిని నర్మద అడుగగా ఇదేం క్వశ్చన్ అని వేదవతి పౌజ్ అంటుంది. ఆ తర్వాత ప్రేమ వంతు కాగా ప్రేమ నీకు ధీరజ్ అంటే చచ్చేంత ఇష్టం అని నర్మద అడగానే.. ఇప్పుడు నిజం చెప్తే ఆడుకుంటారు.. లేదు అంటే శ్రీవల్లి అక్కకి డౌట్ వస్తుందని ప్రేమ కూడా పౌజ్ అంటుంది. ఆ తర్వాత నర్మద వంతు కాగా.. మీరు మావయ్యకి తెలియకుండా గూడుపుఠాని చేస్తున్నారేంటని నర్మదని శ్రీవల్లి అడుగుతుంది దాంతో పౌజు అని నర్మద చెప్తుంది. ముగ్గురు ఓడిపోవడంతో శ్రీవల్లికి కూల్ డ్రింక్ వస్తుంది.
ప్రేమ నాపై కోపంగా ఉంది కదా ఇది ఇచ్చి కూల్ చెయ్యాలని ప్రేమకి శ్రీవల్లి కూల్ డ్రింక్ ఇస్తుంది. అది ప్రేమ తాగి మత్తుగా ఉంటుంది. అప్పుడే ఈ బాటిల్ ఏంటి ఖాళీగా ఉంది ఎవరు తాగరని శ్రీవల్లిని తిరుపతి అడుగగా ప్రేమ అని శ్రీవల్లి చెప్పగానే అది కూల్ డ్రింక్ కాదు మందు అని తిరుపతి అంటాడు. అది విని శ్రీవల్లి బయపడి తన రూమ్ లోకి వచ్చి దాక్కుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.