English | Telugu

Jayam serial : సూర్యని ఇంటికి తీసుకొచ్చిన రుద్ర.. వీరు ఏం చేయనున్నాడు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -91 లో......రుద్రని పారు తక్కువ చేసి మాట్లాడుతుంది‌ దాంతో రుద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు‌ అదంతా గంగ వింటుంది. మరొకవైపు రుద్రకి సూర్య కనిపిస్తాడు. ఏమైంది మొన్న కాల్ చేసావ్.. నేను వచ్చేలోపు వెళ్లిపోయావ్.. అసలు విషయం చెప్పలేదని అడుగుతాడు. రుద్ర నీ ఓటమికి కారణం మా అన్నయ్య అని సూర్య చెప్తుంటే ఎక్కడ వీరు పేరు చెప్తాడో అని వీరు మనుషులు సూర్యని రాయితో కొట్టి వెళ్ళిపోతారు. దాంతో సూర్య స్పృహతప్పి పడిపోతాడు.

మరొకవైపు రుద్రని పారు అవమానించినందుకు తనకి బుద్ది చెప్పాలని గంగ అనుకుని శ్రీను సాయం తీసుకుంటుంది. పారుపై శ్రీను జ్యూస్ పడేలా చేస్తాడు. దాంతో క్లీన్ చేసుకోవడానికి పారు వాష్ రూమ్ కి వెళ్తుంది. అక్కడికి గంగ మాస్క్ పెట్టుకొని పారు వెనకాల వెళ్తుంది. పారుని వెనకాల నుండి వెళ్లి తన చేతులు గట్టిగా పట్టుకొన.. మా రుద్ర సర్ గురించి తప్పుగా మాట్లాడతావా అంటూ వార్నింగ్ ఇస్తుంది గంగ. ఎవతివే నువ్వు అని పారు అనగానే రుద్ర సర్ ఫ్యాన్ ని అని గంగ సమాధానం చెప్తుంది. పారుకి కన్పించుకుండా అక్కడ నుండి వెళ్లిపోతుంది గంగ. ఆ తర్వాత పారు కోపంగా ఉంటే గంగ మాస్క్ తీసేసి వాటర్ తీసుకొని వచ్చి పారుకి ఇస్తుంది.

మరొకవైపు వీరుకి తన మనుషులు ఫోన్ చేసి జరిగిందంతా చెప్తారు. దాంతో వీరు టెన్షన్ పడతాడు. వీరు టెన్షన్ పడడం ఇషిక చూస్తుంది. ఆ తర్వాత సూర్యని రుద్ర ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక్కడే ఉంటాడని చెప్పగానే వీరు టెన్షన్ పడుతాడు. శకుంతల వద్దని గొడవ చేస్తుంది. మనిషి అలా ఉన్నప్పుడు ఇంత పట్టుదల వద్దు శకుంతల అని పెద్దసారు అంటాడు. దాంతో సూర్యని రుద్ర గదిలోకి తీసుకుని వెళ్తారు. మరోవైపు రుద్ర టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.