English | Telugu
Brahmamudi : ఆస్తి కోసం స్వప్నకి విడాకులు ఇస్తానన్న రాహుల్.. కావ్య ఏం చేయనుంది!
Updated : Oct 30, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -864 లో.. కావ్య మల్లెపూలు పెట్టుకొని పాలగ్లాస్ తో గదిలో ఉంటుంది. రాజ్ వచ్చి ఏంటే ఈ అవతారమని కావ్యని అడుగుతాడు. ఉన్నన్ని రోజులు నేను మీతో హ్యాపీగా ఉందామనుకుంటున్నానని కావ్య అంటుంది. ఇప్పుడు ఇవన్నీ వద్దు అని రాజ్ అనగానే మీ నానమ్మ గారు చెప్పారా అని కావ్య అంటుంది. బలవంతంగా రాజ్ ని కావ్య బెడ్ పై తోసేస్తుంది.
మరుసటి రోజు ఉదయం రాహుల్ తన లవర్ తో ఫోన్ మాట్లాడుతుంటే.. అప్పుడే స్వప్న వచ్చి వింటుంది. నీకు కొంచెం కూడా సిగ్గు లేదా అని స్వప్న తిడుతుంది. విన్నావా నాకు నీతో చెప్పే శ్రమ తగ్గిందని రాహుల్ కేర్ లెస్ గా మాట్లాడుతాడు. ఆ తర్వాత కావ్య వ్యాయామం చెయ్యడానికి టీ, షర్ట్ ప్యాంటు తీసుకొని వస్తాడు రాజ్. అది కావ్య వేసుకొని బయటకి వస్తుంది. నువ్వు ఇలాగే బాగున్నావని అపర్ణ, ఇందిరాదేవి చెప్తారు. కావ్య, అప్పు ఇద్దరు కలిసి వ్యాయామం చేస్తారు. కాసేపటికి కళ్యాణ్, రాజ్ ఇద్దరు జ్యూస్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లి జ్యూస్ తాగిస్తారు. మరొకవైపు స్వప్న డల్ గా ఉంటుంది. కావ్య తన దగ్గరికి వెళ్లి ఏమైంది అక్క అని అడుగుతుంది. రాహుల్ గురించి స్వప్న మొత్తం చెప్తుంది.
ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వెళ్లి రాహుల్ ఇలా వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడని కావ్య చెప్తుంది. తరువాయి భాగంలో స్వప్న విడాకుల పేపర్స్ తీసుకొని వచ్చి హాల్లో ఉన్న రుద్రాణి ముందు పెడుతుంది. మీ అబ్బాయి నాకు విడాకులు ఇస్తాడంట అని స్వప్న అంటుంది. అవును, నాకు దీంతో ఉండాలని లేదని రాహుల్ చెప్తాడు. నేనొక అమ్మాయిని ప్రేమించాను.. దాన్ని పెళ్లి చేసుకుంటే కోట్ల ఆస్తులు అని రుద్రాణికి రాహుల్ చెప్తాడు. ఆ తర్వాత అసలు ఎవరు ఆ అమ్మాయి? ఎందుకు రాహుల్ వెంట పడుతుంది కనుక్కోవాలని రాజ్ తో కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.