English | Telugu
Duvvada Madhuri Remuneration: దువ్వాడ మాధురి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Updated : Nov 3, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం దువ్వాడ మాధురి ఎలిమినేషన్ అయింది. ఏడో వారం భరణి ఎలిమినేషన్ అయి ఎనిమిదో వారం హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వగానే అందరు.. భరణి, మాధురిని కలిపి ట్రోల్స్ చేశారు. అయితే మాధురి ఎలిమినేషన్ తనే కావాలని కోరుకుందంట.
మాధురి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రెండో రోజే పవన్ కళ్యాణ్ తో గొడవకి దిగింది. ఆ తర్వాత రేషన్ మేనేజర్ దివ్యతో గొడవ, ఆ తర్వాత సంజనతో గొడవకి దిగింది. ఇక హౌస్ మేట్స్ ని ఇష్టమోచ్చినట్టు తిట్టడంతో తనకి నెగెటివిటీ పెరిగింది ఇక అదే వారం హౌస్ నుండి పంపించాలని ఆడియన్స్ కోరుకున్నారు. కానీ ఆ వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరు నామినేషన్లో లేకపోవడంతో తను సేవ్ అయింది. ఇక ఆ వారం వీకెండ్ లో నాగార్జున తన మీద ఫైర్ అవ్వడంతో తను కాస్త తగ్గింది. ఇక హౌస్ లో కిచెన్ దగ్గర ఉండే తనూజకి క్లోజ్ అయింది మాధురి. ఇక తనేమో రాజా అని మాధురి ఏమో రాజు అని పిల్చుకోవడం మొదలెట్టారు. ఇక ఇద్దరు ఒకరికొకరు దగ్గరయ్యారు. ఇక మాధురి ఎలిమినేషన్ అవ్వగానే తనని చూసి తనూజ ఏడ్చేసింది. ఆమె ఏడ్వడం చూసి మాధురి ఎమోషనల్ అయింది.
మాధురి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న మూడు వారాల వ్యవధిలో వారానికి మూడు లక్షలు వరకు రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తోంది. మొత్తంగా తొమ్మిది లక్షలు వరకు మాధురి సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ పొందిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మాధురి అని బయట ప్రచారం జరుగుతోంది. అయితే తనకి వచ్చిన రెమ్యునరేషన్ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తానని దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డబ్బులు వికలాంగులు, క్యాన్సర్ రోగులు, పేద ప్రజలకు ఉపయోగపడాలి. మాకు దైవం ఇచ్చినదే చాలింది, ఈ మొత్తాన్ని సర్వీస్‌లో కలుపుతామని మాధురి అంది.