English | Telugu

నాన్నకు ఫిట్స్.. టాబ్లెట్ కొనడానికి 12 రూపాయలు కూడా లేవు

రంగస్థలం మహేష్ అంటే చాలు ఎవరైనా గుర్తుపట్టేస్తారు. ఇక మహానటి మూవీలో కూడా అంతే బాగా నటించాడు. అలాంటి మహేష్ రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి తీసుకొచ్చాడు. ఆమె కాళ్ళు కాడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మ గురించి చెప్పుకొచ్చాడు. "మనం ప్రపంచంలో ఎవరి మీద కోప్పడినా వాళ్ళు శత్రువులైపోతారు ఒక్క అమ్మ తప్ప. మనం కూడా అమ్మ మీద ఎందుకు కోప్పడతాం అంటే అమ్మ అంటే పెద్దగా రియాక్ట్ అవదు కాబట్టి అమాయకురాలు కాబట్టి. మా అమ్మా వాళ్ళ అమ్మగారింట్లో మంచి లైఫ్ లీడ్ చేసింది. అమ్మమ్మ తాతయ్య చాలా బాగా చూసేవాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి ఆకలికి కూడా ఇబ్బందులు పడింది. మా నాన్నకు ఫిట్స్ ఉండేవి. కాపిటల్ 200 అనే టాబ్లెట్ ఉండేది. దాని కాస్ట్ 12 రూపాయలు. ఒక ఆరు టాబ్లెట్స్ కొనడానికి కూడా నరకంగా ఉండేది. ఆ డబ్బులు కూడా ఉండేవి కావు. ఇబ్బందుల్లో ఉన్నా కానీ గారంగానే చూసేది. సంకరగుప్తం అని బాలమురళీకృష్ణ గారు పుట్టిన ఊరిలోనే నేను పుట్టాను. అక్కడ ఒక తాటాకు ఇంట్లో ఉండేవాళ్ళం. ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లి ఆ ఊళ్ళోనే ఇల్లు కట్టాలి అనుకున్నాను. నేను అదే ఊరిలో మా అమ్మ కోసం ఇల్లు కట్టాను. రంగస్థలం మూవీలో ఆ నైట్ సీన్ ఎందుకంత బాగా చేసావ్ అని ఒక వ్యక్తి అడిగాడు. నీ కళ్ళ ముందు ఒక మనిషి చనిపోయినప్పుడు చేసే సీన్ లో మా నాన్న ఎక్స్ప్రెషన్ గుర్తొచ్చింది. మా అమ్మ నాన్న మంచే చేశారు. అందుకే నా విషయంలో మంచి జరిగింది. ఎవరికీ అన్యాయం చేయకుండా ధర్మంగా బతకడమే జీవితం.మనం ఉన్నా లేకపోయినా చరిత్ర ఉంటుంది. అదే టీవీ, సినిమా. అందుకే ఈ చరిత్రలో మా అమ్మను కూడా ఒక భాగాం చేయాలనీ అనుకున్నా. ఎప్పటికైనా చూసుకోవడానికి ఉంటుంది అనే నేను ఇక్కడికి తీసుకొచ్చాను " అని చెప్పాడు రంగస్థలం మహేష్.