English | Telugu
వీజే సన్నీ అలా గెలిచాడా.. అరె ఏంట్రా ఇదీ..!
Updated : Dec 22, 2021
బిగ్‌బాస్ రియాలీటీ షో ముగిసింది. ఈ సీజన్ లో ఆల్ రౌండర్ గా ప్రతిభ చాటిన వీజే సన్నీ విజేతగా నిలిచాడు. ఓ సాధారణ యాంకర్‌గా తన జర్నీ మొదలైంది. ఆ తరువాత లైఫ్ స్టైల్ రిపోర్టర్‌గా ఓ ఛానల్ లో పని చేశాడు. ఆ తరువాతే అతనికి నటనపై ఇంట్రెస్ట్ మొదలైంది. బుల్లితెరపై సన్నీ చేసిన తొలి సీరియల్ `కల్యాణ వైభోగమే`. దీన్ని `బొమ్మరిల్లు` ఫేమ్ శ్రీరామ్ వెంకట్ నిర్మించాడు. ఇదే అతన్ని సటగు ప్రేక్షకుడికి చేరువయ్యేలా చేసింది. సీజన్ 5లో విజేతగా నిలిచేలా చేసింది.
Also Read:సిరి, షన్ను రిలేషన్ పై సన్నీ కామెంట్
అయితే సన్నీని విజేతగా నిలిపింది అది కాదని మరో అంశమే అతన్ని విజేతని చేసిందని ప్రచారం మొదలైంది. సన్నీ గెలుపు కొంత మందికి చెంప పెట్టులా మారిందన్నది గుర్తించాల్సిన అంశం. హౌస్ లో ఎలా వుండాలో ఎలా వుండ కూడదో స్నేహానికి ఎంత విలువ ఇవ్వాలో.. తల్లికిచ్చిన మాట కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడాలని సన్నీ చూపించిన తీరు సగటు ప్రేక్షకుడిని కట్టిపడేసింది. సన్నీ ఎవరో తెలియకపోయినా హౌస్ లో తన ప్రవర్తన తీరుతో కోట్లాది మంది హృదయాల్ని గెలుచుకున్నాడు. అదే అతన్ని ఫైనల్ లో విజేతగా నిలబెట్టింది.
Also Read:హీరో అవుతున్న బిగ్ బాస్ 5 కంటెస్టెంట్!
అయితే ఓ వర్గం మాత్రం సన్నీని విజేతగా నిలబెట్టింది.. అతనికి భారీ స్థాయిలో ఓట్లు పడేలా చేసింది అది కాదని కొంత మంది కుల పిచ్చోళ్లు సన్నీ కులం గురించి వెతుకుతున్నారు. ఈ వెతికారు. అప్పుడే వారికి సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి అని తెలిసింది. ఇంకే ముందు కుల ప్రచారం మొదలుపెట్టారు. సన్నీ గెలుపుని కులానికి ఆపాదించి ప్రచారం చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలా ప్రచారం చేస్తున్న వారిని విమర్శిస్తూ.. మరీ ఇంతగా దిగజారాలా అని నెట్టింట కామెంట్ లు మొదలయ్యాయి. నెట్టింట సన్నీపై జరుగుతున్న ప్రచారాన్ని చూసి అతని అభిమానులు `అరె ఏంట్రా ఇదీ` అని దుమ్మెత్తిపోస్తున్నారు.