హీరో అవుతున్న బిగ్ బాస్ 5 కంటెస్టెంట్!
on Dec 20, 2021

బిగ్ బాస్ సీజన్ 5లో వీక్షకుల అభిమానాన్ని పొందిన కంటెస్టెంట్లలో జస్వంత్ అలియాస్ జెస్సీ ఒకడు. మోడల్ అయిన జెస్సీ 8వ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టి, తన ప్రవర్తనతో మంచివాడనిపించుకున్నాడు. తోటి కంటెస్టెంట్ల అభిమానాన్నీ పొందాడు. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్‌లకు అతను సన్నిహిత స్నేహితుడయ్యాడు. అయితే సడన్‌గా అనారోగ్యం బారినపడి హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు జెస్సీ.
Also read: బిగ్‌బాస్ 'వీజే'త సన్నీకి దక్కింది ఎంత?
కాగా, తాను హీరోగా ఓ సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌ను ఆనందపరిచాడు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు ఎక్స్ కంటెస్టెంట్‌గా హాజరైన అతను ఈ విషయాన్ని చెప్పాడు. అయితే అతను బ్యానర్ పేరు తప్పుగా ప్రస్తావించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే సినిమాలో తాను సినిమా చేస్తున్నట్లు అతను చెప్పాడు. కాగా ఈరోజు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసిన పోస్టులో బ్యానర్ పేరును కరెక్ట్‌గా చెప్పాడు. మైత్రేయ మోషన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించే, సందీప్ మైత్రేయ డైరెక్ట్ చేసే సినిమాలో హీరోగా చేస్తున్నట్లు వెల్లడించాడు జెస్సీ.
Also read: మీకు నచ్చినట్లు కాకుండా వాడికి నచ్చినట్లు ఉండనివ్వండి.. దీప్తి ఎమోషనల్ పోస్ట్!
"గైస్.. త్వరలో నా ఫస్ట్ మూవీ ప్రాజెక్ట్ మొదలవుతుందనే విషయం షేర్ చేసుకోవడానికి సంతోషిస్తున్నా. ఈ మూవీని సందీప్ మైత్రేయ డైరెక్షన్‌లో మైత్రేయ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. త్వరలో ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతోంది" అని అతను రాసుకొచ్చాడు. సో.. యాక్టర్‌గానూ అతను ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడని ఆశిద్దాం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



