English | Telugu
Bigg Boss 9 Telugu: తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయేల్..నువ్వా నేనా అంటు ఆర్గుమెంట్స్!
Updated : Oct 22, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో సోమవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక ఇందులో ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఉండగా ఆరుగురు పాత కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే సోమవారం జరిగిన నామినేషన్ లో కళ్యాణ్ చేసిన నామినేషన్ ని ఇమ్మాన్యుయల్ తీవ్రంగా తప్పుబట్టాడు. నువ్వు తనూజని నామినేట్ చేస్తానంటేనే నీకు నేను టికెట్ ఇచ్చాను. కానీ నువ్వు అది వదలేసి సంజనని నామినేట్ చేసావ్.. నమ్మకద్రోహం చేసావని ఇమ్మాన్యుయల్ అనగానే తనూజకి ఫుల్ కోపం వచ్చింది.
ఇక దివ్యని వాష్ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి తనూజ డిస్కషన్ పెట్టింది. వాడు (కళ్యాణ్) నామినేట్ చేయలేదు అనిసి లేచి వాయిస్ రైజ్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదని దివ్యకు తనూజ చెప్పగానే నాకు అర్థమే కాలేదు ఆ పాయింట్ అనేసరికి ఇమ్మాన్యుయల్ వచ్చి మాట్లాడతాటు. నో.. డా.. నువ్వు మాట్లాడకని తనూజ అంటుంది. దీంతో ఇమ్మూ.. ఇప్పుడు కళ్యాణ్ అనేవాడు తనూజని నామినేట్ చేయడానికి నా దగ్గర పాయింట్లు ఉన్నాయని అన్నాడు అందుకే ఇచ్చానంటూ దివ్యకి ఇమ్మాన్యుయల్ చెప్తాడు. తనూజ నన్ను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరికి ఇచ్చాడంటూ అడిగేసరికి.. ఈ వారం నా నామినేషన్స్ పాయింట్ నీ మీదనే ఉంది. అందుకే ఇచ్చానంటూ ఇమ్మాన్యుయల్ చెప్పాడు. అదే చెప్పాల్సిందని తనూజ అడుగగా.. అదేగా ఇప్పుడు చెప్పాను.. నాకు నీ మీద ఒక్కటే పాయింట్ ఉంది ఈ వారం అంతా చూసి నిన్ను నామినేట్ చేస్తానని తనూజకి ఇమ్మూ చెప్తాడు. నాకు సేఫ్ గేమ్ అనిపించిదంటూ ఇమ్మాన్యుయల్ అనేసరికి.. నీది కూడా నాకు సేఫ్ గేమ్ అనిపిస్తుందని తనూజ చెప్తుంది. దానికి చేయి మరి నన్ను నామినేట్ చేయి అంటూ అడిగాడు ఇమ్మాన్యుయల్. అయితే గత ఆరువారాలుగా ఇమ్మాన్యుయల్ నామినేషన్స్‌లో లేడు. దీంతో అతని ఓట్ బ్యాంక్‌పై చాలా చర్చలు ఆడియన్స్‌లో జరుగుతున్నాయి. ఇప్పుడు అది ఆలోచించే.. ఇమ్మాన్యుయల్ ఇలా చేస్తున్నాడేంటని అందరు ఆశ్చర్యపోతున్నారు.
తనకి రమ్యని చేయాలని.. రమ్యకి తినని చేయాలని ఉంది. ఒకరికిచ్చి ఇంకొకరికి ఇవ్వకుంటే పార్షియాలిటీ చూపించినట్లు ఉంటుంది. అందుకే ఇచ్చానని దివ్యతో ఇమ్మాన్యుయల్ అంటాడు. వాళ్లు వాళ్లు చూసుకుంటారు కదా నాకేంటని ఇమ్మాన్యుయల్ అంటాడు. అది విన్న తనూజ సూపర్ గేమ్ అంటూ క్లాప్స్ కొడితుంది. దాంతో ఇమ్మాన్యుయల్ కూడా అదే రిపీట్ చేస్తాడు. గో టూ హెల్ అని తనూజ అనగానే గో టూ హెల్ అని ఇమ్మాన్యుయేల్ అంటాడు. ఇలాంటి వ్యక్తినా నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చానని బాధేసిందని ఇమ్మాన్యుయల్ అనేసరికి ఎవరూ ఎవరికోసం నిలబడలేదని తనూజా అంటుంది. రింగ్స్ గేమ్ తర్వాత.. నాకు ఇమ్మూ తప్ప ఎవరూ లేరని చెప్పావ్.. వాటర్ పూల్ టాస్క్ లో కూడా భరణి అన్న పోసాకే నేను పోసాను.. నీకు సపోర్ట్ చేసి నేను అందరి దృష్టిలో విలన్ అయ్యానంటూ ఇమ్మాన్యుయల్ అనగానే.. సూపర్ సూపర్ అంటు తనూజ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇక తన పాయింట్లు దివ్యతో ఇమ్మాన్యుయల్ చెప్పగానే తను కూడా వ్యాలిడే అంది. ఆ తర్వాత అదే పాయింట్ గురించి కళ్యాణ్ తో డిస్కషన్ చేసాడు ఇమ్మాన్యుయల్.