English | Telugu
Bigg Boss Telugu 8 : మరో ముప్పై రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8!
Updated : Aug 3, 2024
బుల్లితెర టీవీ షోలలో బిగ్ బాస్ షోకి ప్రధానమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇక తాజాగా బిబి టీమ్ టీజర్ ని రిలీజ్ చేసి ఈ సీజన్ పై మరింత ఆసక్తిని పెంచేశారు. అయితే ఇందులోకి వెళ్ళే కంటెస్టెంట్స్ ఎవరు? ఎప్పుడు మొదలవుతుందనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది.
బిగ్ బాస్ ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. గత సీజన్ సెవెన్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఇక ఈ సీజన్ సెప్టెంబరు ఫస్ట్ వీక్ లో మొదలవుతుందని, సెట్ వర్క్ కూడా ఇప్పటికే సగం వరకు పూర్తి అయినట్టుగా తెలుస్తోంది. మరి కంటెస్టెంట్స్ ఎవరూ అంటే.. కిర్రాక్ ఆర్పీ, ఫార్మర్ నేత్ర, అనిల్ జీలా, వేణు స్వామి, రీతు చౌదరి, కుమారీ ఆంటీ, ఇంకా కొందరు డ్యాన్సర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే చాలామందివి ఇంటర్వ్యూలు తీసుకునట్టు తెలుస్తుంది. అయితే ఈ లిస్ట్ లో ఉన్నవాళ్ళు ఎవరు హౌస్ లోకి వెళ్తారనేది బిగ్ బాస్ మొదలయ్యే వరకు తెలియదు. చివరి క్షణం వరకూ ఏదైనా జరగొచ్చు. అయితే తాజాగా విడుదల చేసిన టీజర్ లో నాగార్జున మాట్లాడుతూ.. జాగ్రత్తగా కోరుకో.. ఎందుకంటే ఏదైనా అన్ లిమిటెడ్ అంటూ అన్నాడు. అంటే ఈ సారి హౌస్ లో టాస్క్ లు ఫన్ ఎంటర్టైన్మెంట్ అన్ లిమిటెడ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
బిగ్ బాస్ అన్నీ సీజన్లలో భారీ టీఆర్పీ సాధించిన వాటిల్లో సీజన్-5, 6, 7.. మరి ఈ సీజన్ హిట్టా, ఫట్టా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే సెప్టెంబరు మొదటి వారంలో మాత్రం బిగ్ బాస్ ప్రారంభం అవుతున్నట్టు ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.