English | Telugu

బిగ్‌బాస్ : విన్న‌ర్ ఎవ‌రో ర‌న్న‌ర్ ఎవ‌రో తేల్చేశారు

బిగ్‌బాస్ హౌస్‌లో అస‌లు ఆట ఇప్పుడే మొద‌లైంది. తాజా సీజ‌న్ 14వ వారంలోకి ఎంట‌రైంది. దీంతో హౌస్‌లో మిగిలిన ఇంటి స‌భ్యుల‌తో పాటు ప్రేక్ష‌కుల్లోనూ టెన్ష‌న్ మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా బిగ్‌బాస్ ఇచ్చిన ర్యాంకింగ్ టాస్క్‌తో ఈ సీజ‌న్ విజేత ఎవ‌రో .. ర‌న్న‌ర్ ఎవ‌రో ఇంటి స‌భ్యులు స్ప‌ష్టంగా తేల్చేశారు. 19 మంది ఇంటి స‌భ్యుల‌తో మొద‌లైన ఈ సీజ‌న్‌లో ఇప్పుడు 6 మాత్ర‌మే మిగిలారు.

బిగ్‌బాస్ : ఇంత‌కీ 13 వారాల‌కు పింకీకి ఎంత ద‌క్కింది?

ఈ ఆరు గురు ఇంటి స‌భ్యుల్లో ఒక‌టి నుంచి ఆరు వ‌ర‌కు ఎవ‌రెవ‌రు ఏయే ర్యాంకుల్లో వుండాలో నిర్ణ‌యించాల‌ని అలా నిర్ణ‌యించిన వాటి వెన‌కాల ఇంటి స‌భ్యులు నిల‌బ‌డాల‌ని బిగ్‌బాస్ ఆదేశించాడు. రంగంలోకి దిగిన స‌న్నీ, ష‌ణ్ముఖ్‌, కాజ‌ల్, సిరి ఫ‌స్ట్ ర్యాంక్ నాకు కావాలంటే నాకు కావాల‌ని పోటీప‌డ్డారు. మ‌రీ ముఖ్యంగా కాజ‌ల్, సిరి ఫ‌స్ట్ ర్యాంక్ నాకు కావాలంటే నాకు కావాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. సిరి మాట మార్చి ఫ‌స్ట్‌లో త‌న‌కంటే ష‌న్నుని చూడాల‌ని వుంద‌ని తెలిపింది.

బిగ్‌బాస్ విజేత‌పై మ‌రోసారి క్లారిటీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

ఇక కాజ‌ల్ త‌ను మాత్ర‌మే ఫ‌స్ట్ ర్యాంక్‌లో వుండాల‌ని ప‌ట్టుబ‌ట్టింది ఈ సంద‌ర్భంగా స‌న్నీ చెప్పిన డైలాగ్ న‌వ్వులు పూయించింది. అతిగా ఆశ‌ప‌డిన ఆడ‌ది.. అతిగా ఆవేశ‌ప‌డిన మ‌గాడు సుఖ‌ప‌డిన‌ట్లు చ‌రిత్ర‌లో లేదంటూ `న‌ర‌సింహా` డైలాగ్‌ని చెప్పి న‌వ్వించాడు. చాలా డిస్క‌ర్ష‌న్స్ త‌రువాత హౌస్‌లోని మెజారిటీ వ‌ర్గః ఇంటి స‌భ్యుల ర్యాంక్‌ల‌ని తేల్చేసింది. ఫ‌స్ట్ ర్యాంక్‌లో స‌న్నీ, రెండ‌వ ర్యాంక్‌లో ష‌న్ను, మూడ‌వ ర్యాంక్‌లో కాజ‌ల్‌, నాలుగో ర్యాంక్‌లో శ్రీ‌రామ్‌, ఐద‌వ ర్యాంక్‌లో మాన‌స్‌, ఆర‌వ ర్యాంక్‌లో సిరి నిల‌బ‌డ్డారు. దీంతో ఇంటి స‌భ్యులు విన్న‌ర్ ఎవ‌రో .. ర‌న్న‌ర్ ఎవ‌రో క్లారిటీ ఇచ్చేసిన‌ట్ట‌యింది. వ‌చ్చే వారం 6వ ర్యాంక్‌లో నిలిచిన సిరి ఎలిమినేట్ అయితే మిగ‌తా వాళ్లంతా టాప్ 5కి వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.