English | Telugu

అంద‌రి చేత కంటిత‌డి పెట్టించిన కెవ్వు కార్తీక్‌

ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్ ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న `శ్రీ‌దేవి డ్రామా సెంట‌ర్` బుల్లితెర హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్పిస్తున్న ఈ కామెడీ షోకు న‌టి ఇంద్ర‌జ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 1:00 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ షోకు సంబంధించిన తాజా ప్రోమో ఇటీవ‌ల విడుద‌లైంది. ప్ర‌స్తుతం ఇది యూట్యూబ్‌లో సంద‌డి చేస్తోంది.

ఈ ప్రొమోలో కెవ్వు కార్తీక్ చేసిన స్కిట్‌.. `విచిత్ర సోద‌రులు` చిత్రంలో అప్పు పాత్ర‌ని ఇమిటేట్ చేస్తూ చేసిన పెర్ఫార్మెన్స్‌.. మ‌రుగుజ్జు పాత్ర‌లో త‌ను ఇచ్చిన సందేశం ప్ర‌తీ ఒక్క‌రి హృద‌యాన్ని ట‌చ్ చేసి కంట‌త‌డి పెట్టిస్తోంది. గ‌త కొన్ని వారాలుగా ఫుల్ జోష్‌తో స‌రికొత్త స్కిట్‌ల‌తో ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఆక‌ట్టుకుంటున్న ఈ షో వ‌చ్చే ఆదివారం ఎనిసోడ్‌ని ర‌జ‌నీకాంత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌గా మ‌లిచారు. దీంతో అంతా ర‌జ‌నీ స్టైల్‌ని ఫాలో అవుతూ అదే గెట‌ప్పులు వేశారు. కానీ కెవ్వు కార్తీక్ మాత్రం కాస్త భిన్నంగా ప్ర‌య‌త్నించి అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నాడు.

మ‌రుగుజ్జు వాళ్ల కోసం తానే మ‌రుగుజ్జులా మారి వారి కోసం స్కిట్ చేశాడు. `విచిత్ర సోద‌రులు` లోని అప్పు పాత్రని ఇమిటేట్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన కెవ్వు కార్తీక్ ఇందు కోసం చాలా క‌ష్ట‌ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది. మోకాళ్ల వ‌ర‌కు క‌ట్టేసుకుని అచ్చం మ‌రుగుజ్జు లా అప్పు పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసేశాడు. త‌ను ప్రేమించిన అమ్మాయి నిన్ను దేవుడు మ‌ధ్య‌లోనే వ‌దిలేశాడురా అని ఏడిపించ‌డం...అంతా నా ఆకారాన్నే చూస్తున్నారు కానీ నా మ‌న‌సుని చూడ‌టం లేదేంట్రా అని కార్తీక్ క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం ప‌లువురిని భావోద్వేగానికి లోన‌య్యేలా చేసింది. కార్తీక్ స్కిట్ కి సంబంధించిన ఈ ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.