English | Telugu

కొవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి బిగ్ బాస్ షూటింగ్‌లో పాల్గొన్న క‌మ‌ల్ హాస‌న్‌!

కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించినందుకు కమల్ హాసన్ నుండి వివరణ కోరాలని తమిళనాడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ యోచిస్తోంది. నవంబర్ 22న కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో చెన్నైలోని శ్రీ‌రామ‌చంద్ర మెడిక‌ల్ సెంట‌ర్‌లో చేరిన కమల్ శనివారం (డిసెంబర్ 4) డిశ్చార్జ్ అయ్యారు. అయితే డిశ్చార్జ్ అయిన త‌ర్వాత ఆయ‌న నేరుగా త‌ను హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ త‌మిళ్ సీజ‌న్ 5 సెట్స్‌కు వెళ్లి షూటింగ్‌లో పాల్గొన్నారు.

Also read:బిగ్‌బాస్ : ఇంత‌కీ 13 వారాల‌కు పింకీకి ఎంత ద‌క్కింది?

ఇప్పుడు, కొవిడ్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి నేరుగా త‌న షూటింగ్‌కు వెళ్లాల‌నే క‌మ‌ల్ నిర్ణ‌యంపై త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ వివ‌ర‌ణ కోర‌నుంది. ప్ర‌భుత్వ సేఫ్టీ రెగ్యులేష‌న్ ప్ర‌కారం కొవిడ్ నుంచి కోలుకున్న‌వారు హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయిన త‌ర్వాత ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో గ‌డ‌పాల్సి ఉంటుంది.

Also read:కొవిడ్ నుంచి కోలుకున్న క‌మ‌ల్ బిగ్ బాస్ హోస్ట్‌గా తిరిగొచ్చారు!

"క‌రోనా పాజిటివ్‌గా తేలిన‌వారు హాస్పిట‌ల్‌లో ఐసోలేష‌న్‌లో ఉండి చికిత్స పొందిన త‌ర్వాత‌, ఇంట్లో ఏడు రోజుల పాటు ఐసోలేష‌న్‌లో గ‌డ‌పాలి. కానీ హాస్పిట‌ల్‌లో కోలుకున్న త‌ర్వాత‌, క‌మ‌ల్ ఏడు రోజుల పాటు ఇంట్లో ఐసోలేష‌న్‌లో ఉండ‌లేదు. దానికి బ‌దులుగా ఆయ‌న బిగ్ బాస్ షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లారు. అందువ‌ల్ల త‌న చ‌ర్య‌పై వివ‌ర‌ణ కోరుతూ ఆయ‌న‌కు ఆరోగ్య‌శాఖ నోటీసు పంపుతోంది" అని త‌మిళ‌నాడు హెల్త్ సెక్ర‌ట‌రీ డాక్ట‌ర్ జె. రాధాకృష్ణ‌న్ చెప్పారు.

క‌మ‌ల్ హాస్పిట‌ల్‌లో ఉండ‌గా, ఆయ‌న స్థానంలో ఒక వారం బిగ్ బాస్‌ వీకెండ్ ఎపిసోడ్స్‌కు ర‌మ్య‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.