English | Telugu
Bigg Boss 9 Telugu : భరణికి బిగ్ బాస్ సపోర్ట్.. శ్రీజకి మరోసారి అన్యాయం జరగనుందా!
Updated : Oct 31, 2025
బిగ్ బాస్ సీజన్-9 ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతోంది. అసలు ఎవరు ఊహించనిదే బిగ్ బాస్ చేస్తున్నాడు. అగ్నిపరీక్ష ద్వారా మొదటగా ఆరుగురు కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించారు. అంతవరకు బానే ఉంది.. మళ్ళీ వాళ్ళని వరుసగా ఎలిమినేట్ చేసాడు. ఇప్పుడు కామనర్స్ లో ఎలిమినేట్ అయిన శ్రీజకి అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో తనకి మళ్ళీ రీఎంట్రీ ఉంటుందని బజ్ క్రియేట్ చేశారు. ఇక దీనితో పాటుగా అంతకుముందు వారం ఎలిమినేట్ అయిన భరణిని తీసుకొని వచ్చి ఇద్దరిలో ఎవరో ఒకరు పర్మినెంట్ హౌస్ మేట్ అని చెప్పాడు.
వాళ్ళకి టాస్క్ లు ఇచ్చి ఎక్కువ పర్ఫామెన్స్ ఇచ్చిన వాళ్ళు పర్మినెంట్ హౌస్ మేట్ అని బిగ్ బాస్ మామ చెప్పాడు. ఇంతవరకు బానే ఉంది కానీ హౌస్ లో మొదటివారం నుండి ఎలిమినేషన్ అయిన వాళ్లున్నారు. వారికి టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం రాలేదు. మరి వాళ్ళని వదిలేసి, రెండు వారాల క్రితం ఎలిమినేట్ అయిన భరణికి సెకెండ్ ఛాన్స్ ఇవ్వడం ఏంటని ఆడియన్స్ అంటున్నారు. భరణి ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయ్యాడు.. తనకి అన్యాయం ఎక్కడ జరిగింది.. శ్రీజ అంటే తను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కాకుండా వైల్డ్ కార్డ్ ఒపీనియన్ ద్వారా బయటకు వచ్చింది కనుక తనకి సెకెండ్ ఛాన్స్ పర్లేదు.. ఇప్పుడు ఈ ఇద్దరిలో కూడా ఓటింగ్ లో భరణి ముందు ఉన్నాడు.
మూడు టాస్క్ ల్లో రెండు టాస్క్ లు భరణి టీమ్ విన్ కాగా ఒక్క టాస్క్ మాత్రమే శ్రీజ విన్ అయింది. ఇప్పుడు ఏ రకంగా చుసిన మళ్ళీ శ్రీజ ఎలిమినేట్ అవ్వకు తప్పదు. బిగ్ బాస్ హౌస్ లో ఎవరిని ఉంచాలనుకుంటే వాళ్ళని ఉంచుతాడు. ఎవరిని ఎలిమినేట్ చెయ్యాలనుకుంటే చేస్తాడు. విన్నర్ కూడా అంతే బిగ్‌బాస్ ఏది డిసైడ్ అయితే అదే ఫైనల్. భరణి కంటే స్ట్రాంగ్ ఉండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లేరా అనేది ఆడియన్స్ భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే భరణిని హౌస్ లో పర్మినెంట్ కంటెస్టెంట్ చేయాలని, బాండింగ్ కంటెంట్ ఇవ్వాలని బిగ్‌బాస్ చూస్తున్నాడని తెలుస్తోంది.